అత్యవసర వైద్య సేవల్లో మెడికవర్ హాస్పిటల్ ముందంజ
24×7 ఎమర్జెన్సీ, ఐసీయూ, రేడియాలజీతో వేగవంతమైన చికిత్స
By Ram Reddy
On
హనుమకొండ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 09లోకల్ గైడ్
అత్యవసర వైద్య పరిస్థితుల్లో వెంటనే నిర్ధారణ, సమయానికి చికిత్స ఎంతో కీలకం. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభం నుంచే మెడికవర్ హాస్పిటల్స్ 24 గంటల పాటు నిరంతరంగా పనిచేసే ఎమర్జెన్సీ రూమ్ (ఈఆర్), ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు), రేడియాలజీ సేవలను సమర్థవంతంగా అందిస్తూ, అత్యవసర రోగులకు ఆలస్యం లేకుండా వేగవంతమైన చికిత్సను అందిస్తోందని సోమవారం వరంగల్ మెడికవర్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సెంటర్ హెడ్ నమ్రత అన్నారు. హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగం రౌండ్-ది-క్లాక్ సేవలతో అనుభవజ్ఞులైన ఎమర్జెన్సీ వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో పనిచేస్తోందని, ట్రామా, గుండెపోటు, స్ట్రోక్, శ్వాసకోశ సమస్యలు వంటి అత్యవసర కేసులను సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక ట్రియాజ్ విధానాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఐసీయూ విభాగం ఆధునిక వెంటిలేటర్లు, నిరంతర మానిటరింగ్ వ్యవస్థలు, ప్రాణాధార పరికరాలతో సన్నద్ధంగా ఉండి, అనుభవజ్ఞులైన ఇంటెన్సివిస్టులు, క్రిటికల్ కేర్ సిబ్బంది ఆధ్వర్యంలో అత్యుత్తమ సేవలు అందిస్తోందని వెళ్లడించారు.
అదనంగా రేడియాలజీ విభాగం 24 గంటల పాటు సీటీ అండ్ ఎంఆర్ఐ స్కాన్లు, డిజిటల్ ఎక్స్-రేలు, అల్ట్రాసౌండ్ వంటి వేగవంతమైన నిర్ధారణ సేవలను అందిస్తూ, వైద్యులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేలా సహకరిస్తోందని వివరించారు. ఎమర్జెన్సీ, ఐసీయూ, రేడియాలజీ విభాగాల మధ్య సమన్వయం మెడికవర్ హాస్పిటల్స్ ప్రధాన బలంగా నిలుస్తుందని, దీని ద్వారా నాణ్యమైన అత్యవసర వైద్య సేవలు అందించడంతో పాటు రోగుల ఆరోగ్య ఫలితాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ డాక్టర్ లక్ష్మీ దీపక్, కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ డాక్టర్ శాలిని, కన్సల్టెంట్ ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ లు దినేష్, శుష్మ ప్రియాంక, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సుషాంత్, మెడికల్ హెడ్ డాక్టర్ అనిత, సెంటర్ హెడ్ నమ్రత పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
09 Feb 2026 20:59:17
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో భారీగా నిధులతో అభివృద్ధి 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ ను గెలిపించండి.
