వంగూరి వాచకం -నవరత్నాలు
By Ram Reddy
On
లోకల్ గైడ్
- ధనమెంత ఉన్నా మనిషికి
బలమిచ్చేది మనోధైర్యం
విలువెంత ఉన్నా బంగారానికి
రాగి కలిస్తేనేగా దృఢత్వం.
జనుల పాలిట గడియారం
వల్లమాలిన వెటకారపు వేదిక.
3.సుస్తులు తొలగించే ఔషధం
కలిగించేది ఆనందం
ఆస్తులు అమ్మించే కౌశలం
మిగిలించేది దురంతం .
4.కనపడని కరంటే
తిప్పేది ఆపేది ఫ్యాన్ ను
కనపడని మనసే
మలిచేది తొలిచేది మ్యాన్ ని.
5.కరిగినప్పుడే కదా
కనకం అయ్యేది ఆభరణం
కాగినప్పుడే కదా
క్షీరానికి కమ్మని పరిమళం.
6.భారం మోయలేక మేఘాలు
వదిలేస్తే కురిసేది వాన నీరు
బాధ ఓపలేక హృదయాలు
ద్రవిస్తే కారేది కన్నీరు.
7.ఓటమి తరువాత
వచ్చే గెలుపుకు ఎక్కువ మెప్పు
చీకటి తరువాత
వచ్చే వెలుగుకు ఎక్కువ మెరుపు.
8.బలమైన శత్రువుతో పోరుకు
బాహువులనే నమ్ముకుంటే ఎలా భీష్ముడిని జయించేవాడా
శిఖండి లేకుండా పార్థుడైనా.
9.నీతులు చెప్పేవాడు
గోతులు తవ్వితే ఎలా
తుదముట్టించిన వాడు
తలకొరివి పెడితే ఎలా .
వంగూరి గంగిరెడ్డి
9652286270
షాద్ నగర్
Tags:
About The Author
Latest News
16 Feb 2026 22:29:28
చర్ల, ఫిబ్రవరి 16 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధి అటవీ ప్రాంత పూసుగుప్ప గ్రామంలో సీ ఆర్ పీ ఎఫ్ 81 బెటాలియన్ ఆధ్వర్యంలో...
