మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.
By Ram Reddy
On
శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రజలందరూ సహకరించాలి. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. ఫిబ్రవరి 10. (లోకల్ గైడ్).
ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున, ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, మంటను ప్రేరేపించే వస్తువులు తీసుకురావడానికి అనుమతి లేదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 (బి.ఎన్.ఎస్.ఎస్) సెక్షన్ అమలులో ఉంటుందని, కావున నలుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీటర్ల పరిధిలో ఎవరూ ఉండకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పోలింగ్ కేంద్రాలలో గానీ, పరిసర ప్రాంతాలలో గానీ ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టే ఉద్దేశంతో నగదు, మద్యం లేదా ఇతర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిసిన వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు చేపట్టే చట్టబద్ధమైన చర్యలను అతిక్రమిస్తే అట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. కావున జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసు యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Tags:
About The Author
Latest News
22 Feb 2026 00:04:05
లోకల్ గైడ్: జిల్లేడు చౌదర్ గూడ :
జిల్లేడు చౌదర్ గూడ మండలంలోని ఎల్కగూడ గ్రామపంచాయతీ బోయగూడ లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి
