పండుగలను కలిసి జరుపుకుంటేనే సార్ధకత : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
By Ram Reddy
On
మల్కాజిగిరి, ఆగస్ట్ 10, (.లోకల్ గైడ్ ): పండుగలను అన్ని వర్గాల వారు కలిసి మెలిసి జరుపుకుంటేనే వాటికి సార్ధకత ఏర్పడుతుం దని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం ఆయన, గౌతంనగర్ డివిజన్ పరిధిలోని జెఎల్ ఎస్ నగర్ లో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి హజరైనారు. ప్రత్యేక పూజకు హజరైన వారిని ఉత్సవ కమిటీ నిర్వాహకులు పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. మైనంపల్లి హన్మంతరావుకు మహిళలు రాఖీ కట్టారు. అనంతరం మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ...బోనాల ఉత్సవాలను తెలంగాణ సంస్కృతికి నిదర్శమన్నారు. బోనాలు, రాఖీ పండుగలు మన సంప్రదాయానికి అనుగుణంగా ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు పిట్టల నాగరాజు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి, గౌతంనగర్, మల్కాజిగిరి, మౌలాలి, ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ ల అధ్య క్షులు వైనాల ప్రవీణ్, జీడి సంపత్, వినోద్ యాదవ్ సత్యమూర్తి,గుండ నిరంజన్, సీనియర్ నాయకులు పరమేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Tags: