బాయిజమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
తెలంగాణ కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ డిఎస్ఆర్ రాజేందర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబీకులు రామ్ సింగ్,సరోజిని,సునీత,రష్మీ,రచన,రఘువీర్ సింగ్,అరుణ,రాజ్ కుమార్,సుమన్,రుద్రాన్స్ రాకేష్,నేహా,రాధిక,రూపేష్,ఆద్య ల ఆర్థిక సహకారంతో ఆదివారం మధ్యాహ్నం సాయి భోజన్ అన్నదానం,పండ్లు పంచిపెట్టినట్లు సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్,రాజేశ్వరిలు తెలిపారు.ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు,మానసిక వికలాంగులకు,వృద్ధులకు,అనాథలకు,రోగులకు,పేదవారికి, అన్నార్తులకు అన్నదానం,పండ్లు పంచారు.తెలంగాణ కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ గా ప్రస్తుతం సేవలు అందిస్తున్నారని,ఆయన ఉన్నత విద్యావేత్తగాను,ఉన్నతాధికారి హోదాలోను అన్ని వర్గాల వారికి అండగా ఉంటున్నారని,ముఖ్యంగా పేద విద్యార్థులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు.ఆయన సేవలు గర్హనీయమని అన్నారు.ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం,అన్నదానంతో తృప్తి పరుద్దాం సేవే లక్ష్యం సేవే మార్గంగా,మానవసేవే మాధవసేవ అనే ఉద్దేశంతో ట్రస్ట్ కొనసాగుతుందని త్రవిద్య,శ్రవిద్య, త్రయాక్షర్ లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ ట్రస్ట్ సభ్యులు పోతరాజుల తిరుపతి,భీమన్న,జాయ్ సేవకులు పాల్గొన్నారు.
About The Author
