పీహెచ్ సీ సెంటర్ లలో మౌలిక వసతులు కల్పించాలి
అధికారులకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు
మేడ్చల్
మల్కాజిగిరి, జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్:జూలై 29: 24 గంటలు వైద్య సేవలు అందించే పీహెచ్ సీ సెంటర్లకి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కీసర మండలంలోని పిహెచ్ సీ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజుకు ఎన్ని ఓపి కేసులు ఉంటాయి..? ఎన్ని ప్రసవాలు జరుగు తాయని మెడికల్ ఆఫీసర్ ను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ రోజుకు ఎంతమందికి వేస్తారని అడిగారు. ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ ఆసుపత్రి కింద ఎన్ని సబ్ సెంటర్లు ఉన్నాయని కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ల్యాబ్ ను, మెడిసన్ రూమ్ ను, ఆసుపత్రి పరిసరాలను ఆయన పరిశీలించారు. వర్షం నీరు కురిసి గోడలు నిమ్మ రావడంతో తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం వారిని ఆదేశించారు. ఆస్పత్రికి అవసరమైన మరమ్మత్తులు సంబంధించిన ప్రతిపాదనలు తనకు వెంటనే పంపాలని మెడికల్ ఆఫీసర్ కు, కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణాలను స్థలాన్ని పరిశీలించారు. ఈ పర్యటన లో డిఎంఅండ్ హెచ్ ఓ ఉమాగౌరీ, ఆర్ డిఓ ఉపేందర్ రెడ్డి, కీసర ఎమ్మార్వో అశోక్, మెడికల్ ఆఫీసర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
About The Author
Related Posts
