గ్రామాల అభివృద్ధి  చెందడమే నా ధ్యేయం

కలెక్టర్ నర్సింగ్ రావుతో కలిసి పల్లె జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు.  

గ్రామాల అభివృద్ధి  చెందడమే నా ధ్యేయం

లోకల్ గైడ్ : 
గద్వాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహనరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో గురువారం అయన జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్ రావుతో కలిసి పల్లె జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు.  రైతు వేదికలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, తదితర కార్యక్రమాలు మండలంలో ముమ్మరంగా కొనసాగు తున్నాయన్నారు. యూరియా కొరత త్వరలో తీర్చే విధంగా చర్యలు చేపట్టమని తెలిపారు. అనంతరం గంగిమాన్ దొడ్డి గ్రామం చేరుకొని నూతన గ్రామ పంచాయితీ భవనం నిర్మానానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో  నాయకులు బండారి భాస్కర్, జంబు రామానగౌడ్, విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News