జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు

జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.

ఖమ్మం :లోకల్ గైడ్ :
ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ,  గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మధిర నుంచి కూసుమంచి వరకుIMG-20260510-WA0066 జరిగిన పలు శుభకార్యక్రమాల్లో పాల్గొని జనంతో మమేకమయ్యారు.  తొలుత మధిర పట్టణం జిలుగుమాడులో బోయిన శ్రీనివాసరావు - చిలక పున్నయ్యల పిల్లల వివాహ వేడుకకు హాజరైన మంత్రి, అనంతరం ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్‌లో వేప అంజయ్య, సామల సత్యం కుమారుల వివాహాలకు, మామిళ్లగూడెంలో తూము అనిల్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. దానవాయిగూడెంలో కొలిచలం గురునాధం కుమారుడి శుభకార్యానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కైకొండాయిగూడెంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం ఎస్ ఆర్ హోమ్స్ లో దేవరపల్లి శ్రీనివాస రెడ్డి, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి ప్రభాత్ నగర్ లో  నాగేంద్రప్రసాద్‌  నివాసాల్లో జరిగిన ఉప్పలమ్మ, మైసమ్మ తల్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలో బానోత్ తేజా కుమార్తె వివాహానికి, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లిలో పిట్టల గణపయ్య కుమారుడి పెళ్లికి, కేబీఆర్ నగర్‌లో షేక్ మోసిన్ ఖాన్ కుమారుడి రిసెప్షన్ వేడుకకు హాజరై పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. చివరగా కూసుమంచి మండలం పెరికసింగారంలో సండ్ర ఉపేందర్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయా ప్రాంతాల్లో మంత్రి పొంగులేటికి ప్రజలు, నాయకులు ఘనస్వాగతం పలికారు.

Tags:

About The Author

Latest News