రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమన్వయానికి కీలక అడుగు
రంగారెడ్డి జిల్లా అక్రిడేషన్ కమిటీ నియామకం
By Ram Reddy
On
చిలకమర్రి రాంరెడ్డికి కీలక బాధ్యత
రంగారెడ్డి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
రంగారెడ్డి జిల్లా అక్రిడేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ సంబంధిత అధికారుల ప్రొసీడింగ్స్ విడుదలయ్యాయి. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, మీడియా సంబంధిత అంశాల సమన్వయం కోసం ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ఈ కమిటీలో వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద, మధ్య, చిన్న పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో, వీడియో జర్నలిస్టుల ప్రతినిధులకు సభ్యత్వం కల్పించారు. అలాగే టీజీఎస్‌ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే, ఐ అండ్ పీఆర్ శాఖ అధికారులు కూడా సభ్యులుగా ఉండనున్నారు. ప్రత్యేకంగా, లోకల్ గైడ్ ఎడిటర్ చిలకమర్రి రాంరెడ్డిని కమిటీ సభ్యునిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నో సంవత్సరాలుగా జర్నలిజం రంగంలో సేవలందిస్తున్న ఆయనకు ఈ నియామకం రావడం పత్రికా వర్గాలlo హర్షం వ్యక్తమవుతోంది. స్థానిక సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న లోకల్ గైడ్ ఎడిటర్ చిలకమర్రి రాంరెడ్డి అనుభవం కమిటీకి మేలు చేస్తుందని భావిస్తున్నారు. అలాగే ఆంధ్రజ్యోతి, సియాసత్, దిశ, టీవీ5, టీవీ9 వంటి ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో, అక్రిడేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా అమలు చేయడంలో ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags:
About The Author
Related Posts
Latest News
20 Apr 2026 18:23:18
చిలకమర్రి రాంరెడ్డికి కీలక బాధ్యత
