రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.

 రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా లోకల్ గైడ్ దిన పత్రిక ఎడిటర్ చిలకమర్రి రాంరెడ్డి నియామకం.

రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.

మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా లోకల్ గైడ్ దినపత్రిక ఎడిటర్ రాంరెడ్డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపిన లోకల్ గైడ్ దినపత్రిక జర్నలిస్ట్ లు , స్టాఫ్, అడ్వటైజింగ్ సిబ్బంది.                                         

   రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):   
రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాకు జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ (డీఎంఏసీ)ని ప్రకటించింది. ఈ మేరకు సమాచార, ప్రజాసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర స్థాయి మీడియా అక్రెడిటేషన్ కమిటీని ఏర్పాటు చేసి, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కమిషనర్‌కు అధికారాలు కల్పించింది. కమీషనర్ ప్రియాంక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, రెండేళ్ల కాలానికి గాను జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీని సోమవారం ప్రకటించింది.
ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీలో పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సభ్యులుగా నియమితులయ్యారు.
రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులుగా మన తెలంగాణ బ్యూరో ఇన్‌చార్జి కె. శ్రీకాంత్ రెడ్డి, స్వచ్ఛ  తెలంగాణ దిన పత్రిక ఎడిటర్ ఉప్పరి శేఖర్,లోకల్ గైడ్ దిన పత్రిక ఎడిటర్ చిలకమర్రి రాంరెడ్డి, స్వతంత్ర జర్నలిస్ట్ సయ్యద్ ఇక్రాముల్లా హుస్సైనీ, ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ అన్నవరపు శేఖర్ బాబు, సియాసత్ రిపోర్టర్ మొహమ్మద్ సిరాజ్, దిశ డైలీ బ్యూరో చీఫ్ గంజి ప్రదీప్ కుమార్ లు నియమితులైనట్లు రంగారెడ్డి జిల్లా ప్రజా సంబంధాల అధికారి బాలేశ్వరి తెలిపారు.
Tags:

About The Author

Latest News