త‌ల్లింద్రుల‌పై బెంగ‌తో ఉన్న చిన్నారి బాలిక త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసిన మంత్రి

జూప‌ల్లి కృష్ణారావు మంత్రిని మాట్లాడుతున్న‌

త‌ల్లింద్రుల‌పై బెంగ‌తో ఉన్న చిన్నారి బాలిక త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసిన మంత్రి


లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
చిన్నారిని చూసి వెళ్లాల‌ని సూచించిన మంత్రి
విద్యార్థిని ఓదార్చి ధైర్యం చెప్పిన మంత్రి జూప‌ల్లి
గురుకుల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జూప‌ల్లి కృష్ణారావు
కొల్లాపూర్ ప‌ట్ట‌ణంలోని సాంఘీక సంక్షేమ బాలిక‌ల‌ గురుకుల పాఠ‌శాల‌ను ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మంగ‌ళ‌వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇటీవల డైట్ చార్జీలు పెంచిన నేపథ్యంలో మెనూ అమలుపై విద్యార్థులను ఆరా తీశారు. విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసి మీ పిల్ల‌ల‌కు నాణ్య‌మైన, రుచిక‌ర‌మైన భోజ‌నం అందుతుందా అని మంత్రి అడిగారు.  “మా పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతోంది” అని తల్లిదండ్రులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలోని తరగతి గదిని సంద‌ర్శంచారు. ప‌ర్యావ‌ర‌ణం అంటే ఏంట‌ని విద్యార్థుల‌ను ప్ర‌శ్నించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఉద్బోదించారు. అనంత‌రం అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తి అయినప్పటికీ ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదని టిజిఈడబ్ల్యుఐడిసి డీఈ వెంకట్ రెడ్డి,  ఏఈ శ్రీనివాస్‌ను ప్ర‌శ్నించారు. వెంటనే  ప్రారంభోత్స‌వానికి ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు.
ఈ సందర్భంగా టీచర్లు కాంపౌండ్ వాల్, క్రీడా ప్రాంగణం, బాత్రూమ్ వసతులను మెరుగు పరచాలని కోరగా, మంత్రి అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తో మాట్లాడి, డీఎంఎఫ్‌టీ నిధుల ద్వారా బాత్రూమ్ ల సమస్యను తక్షణమే పరిష్కరించాల‌ని ఆదేశించారు. అలాగే, కాంపౌండ్ వాల్‌కు నిధులు ఇప్పటికే మంజూరైన నేపథ్యంలో పనులను వేగంగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఏఈ కి ఆదేశాలు ఇచ్చారు
తల్లితండ్రుల మీద బెంగతో రోదించిన బాలికను ఓదార్చిన మంత్రి జూప‌ల్లి
నాగ‌ర్ క‌ర్నూల్ మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్ర‌ల మీద బెంగ‌తో రోదిస్తూ.. మంత్రి కంట‌ప‌డ్డారు. దీంతో మంత్రి ఆ చిన్నారిని వ‌ద్ద‌కు వెళ్లి ఓదార్చి, బాగా చ‌ద‌వుకొని ఉన్న‌త‌స్థాయికి చేరుకోవాల‌ని ధైర్యం చెప్పారు. వెంట‌నే బాలిక త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసి విష‌యాన్ని మంత్రి వారికి వివ‌రించారు. ప్ర‌తీ శ‌నివారం లేదా ఆదివారం స్కూల్ ను సంద‌ర్శంచి మీ పాప‌తో రెండు గంట‌ల పాటు గ‌డిపి వెళ్లాల‌ని కోరారు. పాఠ‌శాల‌కు వ‌చ్చి ఆ విద్యార్థిని చూసి వెళ్లాలని సూచించారు. పాప‌తో వారితో మాట్లాడించారు. మంత్రి నుంచి ఫోన్ రావ‌డంతో వారు సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

Tags:

About The Author

Latest News

ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం  ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం 
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల గ్రంథాలయం లో ఘనంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవాన్ని నిర్వహించారు. భారతదేశంలో 'గ్రంథాలయ శాస్త్ర పితామహుడు' అని  పిలువబడే...
అత్యంత విచారకరమైన సంఘటన – జాగ్రత్త
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి
అమెరికా నేలపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రోకేటివ్ వ్యాఖ్యలు – భారత్‌పై అణు దాడి బెదిరింపులు
ముహమ్మద్ అలీ’ – రింగ్‌లో గర్జించిన మహా వీరుడు, సమాజానికి మార్గదర్శి
భారత్‌పై 50% సుంకం – ట్రంప్ నిర్ణయంపై విమర్శల తుఫాన్
భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్