నాగార్జునసాగర్ నుంచి వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా… జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి . జగదీష్ రెడ్డి
ఏ ఎమ్ ఆర్ పి కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు.జిల్లా మంత్రులకు చిత్తశుద్ధి లేదు
By Ram Reddy
On
ఏ. పీ .కి నీళ్లు వదిలేంత ఆత్రుత… జిల్లాలో రైతులకు నీళ్లు ఇవ్వాలనే తపన లేదు. మా పాలనలో వరుసగా 8 ఏళ్లు చెరువులు నిండుగా ఉంచి… ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చాం . మాజీ మంత్రి గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి
నల్లగొండ ఉమ్మడి జిల్లా లోకల్ గైడ్:
ఏ ఎన్ ఆర్ పి లిఫ్ట్ కింద D25, D26, D29, D31, D39, D40 డిస్ట్రిబ్యూటరీల కింద 70 వేల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత టిఆర్ఎస్ జనని మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి మంత్రి అయిన తర్వాత మళ్లీ పొలాలు ఎండిపోతున్నాయి అన్నారు.హెలికాఫ్టర్ల ఆర్భాటాలు… కమిషన్ దందాలు తప్ప రైతుల పట్ల ప్రేమ లేదు అని ఆరోపణ చేశారు.
గోదావరి నీటిని ఆంధ్రకు కట్టబెట్టే యత్నాలు జరుగుతున్నాయి అన్నారు. రైతులు ధర్నా చేస్తే కేసులు పెట్టడం దుర్మార్గం అన్నారు.
కనీసం ఉదయ సముద్రం నింపని ప్రభుత్వం అని జగదీష్ రెడ్డి విమర్శ చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు
కోమటిరెడ్డి – ఉత్తమ్ ఇద్దరూ అసమర్థులే అన్నారు. కృష్ణ జలకళ ఉన్నా… జిల్లాలో చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయి అన్నారు.
వెంటనే పూర్తిస్థాయిలో సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నల్గొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌ను మంత్రి క్యాంపు ఆఫీస్‌గా మార్చడం దుర్వినియోగం చేయడమే అన్నారు.నల్గొండ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసింది బి ఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. కోమటిరెడ్డి పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు … కోమటిరెడ్డి కి మంత్రి పదవికి అర్హత లేదు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు,
Tags:
About The Author

Latest News
19 Aug 2025 20:08:16
వినాయక విగ్రహాలుఏర్పాటుకు అనుమతి తప్పనిసరి విగ్రహాల ఏర్పాటు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి . మోమిన్ పెట్ సర్కిల్ఇ న్స్పెక్టర్ బి.వెంకట్