ప్రజల పక్షాన పోరాటం చేసే వారికి ఓటెయ్యండి.

ఐద్వా జాతీయ నాయకురాలు మల్లు లక్ష్మి 

ప్రజల పక్షాన పోరాటం చేసే వారికి ఓటెయ్యండి.

మిర్యాలగూడ ఫిబ్రవరి 7
( లోకల్ గైడ్,తెలంగాణ)

 మిర్యాలగూడ టౌన్ న వ తెలంగాణ.ఈనెల 11వ తేదీన మిర్రాడు మున్సిపాలిటీకి జరగనున్న ఎన్నికల్లో ప్రజల పక్షాన పోరాడి విజయాలు సాధించిన మధులతను గెలిపించాలని ఐద్వా జాతీయ నాయకురాలు మల్లు లక్ష్మి కోరారు.  శనివారం నాడు స్థానిక 17వ వార్డులో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి మధులత గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు. ప్రచారంలో మహిళల నుండి మంచి స్పందన కనిపించింది. వార్డులో గతంలో కూడా సిపిఎం కౌన్సిలర్  స్వర్గీయ రామిరెడ్డి కౌన్సిలర్ గా గెలిచిన సమయంలో అభివృద్ధి జరిగిందని ప్రజా సమస్యల పట్ల సిపిఎంకు అలాంటి నిబద్ధత ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో మహిళా సమస్యలు చాలా ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో పాలకవర్గం విఫలమైందని తెలిపారు. పట్టణంలో రైల్వే సమస్య మురికి నీటి సమస్య పేదలకు ఇవ్వాల్సిన రేషన్ కార్డులు ఇవ్వడంలో పాలకవర్గం విఫలమైందన్నారు. 17వ వార్డు నుండి పోటీ చేస్తున్న మహిళతో పోరాట కుటుంబం నుండి వచ్చిందని తమ కుటుంబాల్లో మల్లు స్వరాజ్యం వెంకట నరసింహారెడ్డి మొదటి నుండి ప్రజల కొరకే పాటు పడుతున్నారని అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మధులత కూడా ఎన్నికల్లో గెలిస్తే ప్రజా సమస్యలే ఎజెండాగా పరిష్కార దిశగా పనిచేస్తుందని ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వారి వెంట మహిళా సంఘం నాయకురాలు ప్రభావతి వరలక్ష్మి గోవర్ధన తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు  మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు
గీత వృత్తి రక్షణకై బడ్జెట్ లో 5 వెల కోట్లు కేటాయించాలని కోరుతూ *ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల నిరాహార దీక్షను జయప్రదం చేయండి.
అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పని చేస్తాను..
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు
మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా : సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడి.
ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ పీహెచ్ డీలో డాక్టరేట్ రావడంఫై పలువురి హర్షం. 
ప్లాస్టిక్ నివారణకు జ్యూట్ బ్యాగుల ప్రోత్సాహం