నల్లగొండ లోకల్ గైడ్ :
గ్రామ పాలన అధికారులు పనిపై పూర్తి శ్రద్ధ వహించి విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు . శనివారం ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన గ్రామ పాలనాధికారుల కౌన్సిలింగ్ కు హాజరై మాట్లాడుతూ గ్రామ పాలనాధికారుల కౌన్సిలింగ్ ను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగుతున్నదని, ఎలాంటి సిఫారసులకు ,పక్షపాతానికి ఇందులో తావు లేదని అన్నారు. గ్రామ పలనాధికారులుగా ఉత్తర్వులు అందుకున్న వారు సోమవారం నాటికి నూటికి నూరు శాతం విధుల్లో చేరాలని కోరారు. అభ్యర్థులందరి సమక్షంలోనే ఖాళీల జాబితా ప్రదర్శిస్తూ వారి ఐచ్ఛికాల మేరకు పోస్టింగులు కేటాయించడం జరుగుతున్నదని, అందువల్ల గ్రామ పాలన అధికారులు వారి ఐచ్ఛికం మేరకు తీసుకున్న పోస్టులలో చేరి శ్రద్ధ వహించి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి రెవిన్యూ శాఖపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత గ్రామ పాలన అధికారులపై ఉందని అన్నారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి ,తదితరులు ఉన్నారు.