ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచిన కూడా  భోజనంలో నాణ్యత పెరగడం లేదు .

మర్రిగూడ మోడల్ పాఠశాల  జూనియర్ కళాశాల హాస్టల్ తనిఖీ .  వండిన ఆహారం,  రోజువారి మెనూ పరిశీలన  .  ప్రతి రెసిడెన్షియల్ పాఠశాల అభివృద్ధికి స్థానిక నాయకులతో కమిటీలు  .

ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచిన కూడా  భోజనంలో నాణ్యత పెరగడం లేదు .

1 కోటి 25 లక్షల సొంత ఖర్చుతో కస్తూరిబా పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు బాత్రూమ్స్ లెట్ రూమ్స్ ను పరిశీలన .  ఆట స్థలం కాంపౌండ్ వాల్, మురుగునీటి ట్యాంక్  నిర్మాణాలపై పలు సూచనలు  .  కస్తూరిబా బాలికల పాఠశాల  కాంపౌండ్ వాల్ లోపల ఉన్న  విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని ఏఈ కి ఫోన్ లో ఆదేశించిన ఎమ్మెల్యే.  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .

 

 

 

IMG-20250906-WA0168

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. .   (లోకల్ గైడ్).

 

 


 నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ మోడల్  పాఠశాల జూనియర్ కళాశాల  వసతి గృహాన్ని  మునుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తనిఖీ చేశారు . విద్యార్థినుల డార్మెటరీ హాల్, డైనింగ్ హాల్, వంటగది, బాత్రూంలు, లెట్ రూమ్ లు పరిశీలించి  నాన్యమైన భోజనం పెడుతున్నారా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.... IMG-20250906-WA0164ప్రభుత్వం  మెస్ చార్జీలు పెంచినప్పటికీ  విద్యార్థులకు పెట్టె భోజనంలో నాణ్యత ఉండడం లేదని  అన్నారు... అనంతరం మోడల్ పాఠశాలను పరిశీలించారు తరగతిగదులు ఆటస్థలం పరిశీలించి మోడల్ పాఠశాల అభివృద్ధికి స్థానిక నాయకులతో కమిటీ  ఉంటుందని, వారందరూ వచ్చి మోడల్ పాఠశాలలో ఏ ఏ సమస్యలు ఉన్నాయని విషయాలకు సంబంధించి పరిశీలన చేసి పరిష్కరిస్తారని తెలిపారు IMG-20250906-WA0163
 అనంతరం మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలకు చేరుకొని  1 కోటి 25 లక్షల తన సొంత ఖర్చుతో నిర్మిస్తున్న తొమ్మిది  నూతన తరగతి  గదులను, 30కి పైగా బాత్రూంలు లెట్ రూమ్ లను, మురుగునీటి వ్యవస్థను పరిశీలించారు... కస్తూరిబా పాఠశాల ఆవరణలో ఉన్న  విద్యుత్ స్తంభాలను తీగలను  వెంటనే తొలగించాలని విద్యుత్ అధికారులను ఫోన్లో ఆదేశించారు... కస్తూరిబా పాఠశాల విద్యార్థినులకు ఆడుకోవడానికి  నూతన ఆటస్థలం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.. మర్రిగూడ  మండల కేంద్రంలో  ప్రభుత్వ భూములను సర్వే చేయించి ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని  అక్కడే ఉన్న రెవెన్యూ అధికారులను ఆదేశించారు... ఆట స్థలాన్ని ప్రభుత్వ భూమి ఎంతవరకు ఉంటే అంతవరకు  విస్తరించాలని సూచించారు.ఎమ్మెల్యే  వెంట డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి తోపాటు ,  మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు...IMG-20250906-WA0167

Tags:

About The Author

Latest News