నల్లగొండ :లోకల్ గైడ్
సిపిఎం అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సెప్టెంబర్ 12న నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు.ఆదివారం సిపిఎం నల్గొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సిపిఎం జాతీయ కార్యదర్శిగా, ఉత్తమ పార్లమెంటేరియన్ గా ప్రపంచ కమ్యూనిస్టులను ఏకం చేయడం కోసం అనేక సమావేశాల్లో పాల్గొన్న కామ్రేడ్ ఏచూరి చరిత్ర నేటి యువతరానికి ఎంతో ఆదర్శనీయమని అన్నారు. వారిని స్మరించుకుంటూ వారి పోరాటాలు త్యాగాల స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు నిర్మించడానికి వారి వర్ధంతి సందర్భంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి - సమకాలిన రాజకీయాలు అనే అంశంపై సెప్టెంబర్ 12న నల్గొండ పట్టణంలో సెమినార్ నిర్వహించడం జరుగుతుందని ఈ సెమినార్లో నల్లగొండ నియోజకవర్గం స్థాయి పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ప్రజాతంత్ర లౌకికవాదులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు .ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు ప్రభావతి, జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకట రమణారెడ్డి, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, నల్లగొండ తిప్పర్తి మండల కార్యదర్శి నలపరాజు సైదులు, మన్నెం బిక్షం, మాడుగులపల్లి మండల సహాయ కార్యదర్శి పుల్లెంల శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.