ప్రజలకు సేవ చేసే వ్యక్తులకు, మున్సిపల్ సిబ్బందికి ,వైద్య శిబిరం నిర్వహించడం మంచి పరిణామం.

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .

ప్రజలకు సేవ చేసే వ్యక్తులకు, మున్సిపల్ సిబ్బందికి ,వైద్య శిబిరం నిర్వహించడం మంచి పరిణామం.

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); యాదాద్రి భువనగిరి జిల్లా...చౌటుప్పల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో  ఆర్కే హాస్పిటల్ అండ్ కామినేని హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో పల్లె పల్లె కి వైద్యం కార్యక్రమంలో భాగంగా చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న  123 వ,ఉచిత వైద్య శిబిరాన్ని  మునుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ
05c464fc-71b6-4556-b04e-c803859b01baప్రజలకు సేవ చేసే వ్యక్తులకు ,మున్సిపల్ సిబ్బందికి  వైద్య శిబిరం నిర్వహించడం మంచి పరిణామం ఆన్నారు.
చావా ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
81e586e0-a3d4-4508-bab0-f1e33a4e7468ప్రభుత్వమే అన్ని చేయాలంటే కాదు, ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ తోటి  సామాజిక కార్యక్రమాలు చేయాలి అన్నారు. మా తల్లి  కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద  ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము అన్నారు. చావా ఫౌండేషన్ కి  మా ఫౌండేషన్ తరపున మా ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుంది  అన్నారు. 
తాను శాసనసభ్యుడుగా కాకుండా ఒక స్నేహితుడు లాగా, వ్యక్తిగా సహాయం చేస్తా అన్నారు.
పదవి అనేది శాశ్వతం కాదు, కానీ మన వ్యక్తిత్వం సేవ చేయాలని గుణం ఉండడం శాశ్వతం  అన్నారు. సేవ చేయాలనే గుణం పుట్టిన నాటి నుండి మరణించే వరకు ఉంటుంది.. కానీ పదవి ఉండదు అన్నారు.

Tags:

About The Author

Latest News