ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెరిగిన హమాలి రేట్లు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా . ( లోకల్ గైడ్ ).
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేవరకొండ లోని ఎరువుల షాపుల దిగుమతి హమాలి రేట్లు పెంచుకోవడం జరిగిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ,జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి తెలిపారు.శనివారం దేవరకొండ మార్కెట్ యార్డ్ లో జరిగిన ఫెర్టిలైజర్స్ షాప్ ల యాజమాన్యం ఏఐటీయూసీ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో పరస్పర అంగీకారము మేరకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలిరేట్లూ పెంచుకోవడం జరిగిందని దేవేందర్ రెడ్డి తెలిపారు.రెండు సంవత్సరాలకొకసారి జరిగే అగ్రిమెంట్లో గతము లో ఉన్నటువంటి రేట్లపై 15% ఆధనంగా పెంచుకోవడం జరిగినది అన్నారు. ఎగుమతి దిగుమతి హమాలి రేట్ల తో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, సంవత్సరానికి రెండు జతల బట్టలు ఇవ్వాలని తీర్మానించారు. కార్మిక హక్కుల కోసం ఏఐటియుసి అండగా నిలబడి నిరంతరము రాజీలేని సమరశీల పోరాటాలను నిర్వహిస్తుందని అన్నారు. హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించి బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి కోరారు. ఆసంగటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం లేకపోవడం వల్ల లక్షలాదీ ఇన్ మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
ఏఐటీయూసీ డివిజన్ కోశాధికారి జే.వెంకట్రాములు, ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కోశాధికారి దాచేపల్లి రమేష్ నీలా రవి జాఫర్ ఈ లింగయ్య పాపయ్య శివ ,కొండల్ రెడ్డి ,రాములు తిరుపతయ్య రవీందర్ రెడ్డి . హమాలి యూనియన్ అధ్యక్షులు నీలా వెంకటయ్య కార్యదర్శి గోదాస్ కృష్ణయ్య ,కడారి శీను జంగయ్య దనయ్య సైదులు వీరయ్య సత్తయ్య వెంకటయ్య సత్యనారాయణ లింగయ్య అంజి తదితరులు పాల్గొన్నారు.