కాలేశ్వరం ప్రాజెక్టు పై కెసిఆర్ను హరీష్ రావును బదనాం చేయాలని ప్రభుత్వం కుట్రలు.
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. (లోకల్ గైడ్); కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం,... కాళేశ్వరం ప్రాజెక్టుపై.. కుట్రలు పన్ని.. కెసిఆర్ ను, హరీష్ రావును అప్పటి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నదని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి,గడియారం సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు.. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నదని.. కెసిఆర్ పై ఏ కుట్రలు పడిన.. ప్రజల మద్దతుతో తిప్పికొడతామని.. ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోయిందని, తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వంపై ఏర్పడిందని.. దాన్ని మరల్చటానికే.. కాలేశ్వరం గ్రామ ఆడుతుందని అన్నారు. మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ
నిన్నటిదాకా సీబీఐ ని విమర్శించిన,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేడు అదే సిబిఐ కి కాళేశ్వరం.. పై కుట్రపూరితంగా... విచారణకు ఇవ్వాలని అసెంబ్లీ లో తీర్మానించారని .. ఈ వ్యవహారం మొత్తం ఒక కుట్రపూరితంగా జరుగుతుందని ప్రజలందరూ అనుమానిస్తున్నారని... ఎటువంటి విచారణనైనా తమ నాయకులు ఎదుర్కొంటారని కంచర్ల అన్నారు. తెలంగాణ కోసం, ప్రాణత్యాగానికైనా సిద్ధపడి,కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్, గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని, అన్నపూర్ణగా, దేశంలోనే అత్యంత ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తీర్చిదిద్దారని, తాను కలలు కన్న తెలంగాణను కోటి ఎకరాల మాగాణి గా.. కాలేశ్వరం ఇతర ప్రాజెక్టులతో.. మిషన్ కాకతీయ తో, చెక్ డ్యాములతో సస్యశ్యామలం చేశారని. నీటికి, కరెంటుకు, ఎరువులకు, పెట్టుబడి సాయానికి, కొరత లేకుండా .. రైతులను ఆదుకున్నారని...
నేడు ఏం జరుగుతుందో.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు గమనిస్తున్నారని అన్నారు.. ఎరువుల కోసం చెప్పులు పెట్టే పాత రోజులు మళ్లీ రైతు గుర్తుతెచ్చుకుంటున్నారని రైతుల గోస చూస్తుంటే బాధ కలుగుతుందని అన్నారు. కెసిఆర్ కు ఏ ద్రోహం తలపెట్టినా.. ప్రజలు తిరగబడతారని, అన్నారు.
పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తున్న.. బిఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసు బలవంతంగా.. అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.. కంచర్ల భూపాడిని ఇతర నాయకులను అరెస్టు చేసే సందర్భంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.. అటు తర్వాత టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో.. సంతకాలు తీసుకొని సొంత పూచికత్తులపై అందరిని విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ పార్టీ.. సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, మాజీ ఆర్ వో మాలే శరణ్య రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ కనగల్ సింగిల్ విండోస్ చైర్మన్ వంగాల సహదేవరెడ్డి,మాజీ ఎంపీపీ ఎస్ కే కరీం పాషా, సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య,మైనం శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి, తుమ్మల లింగస్వామి, పాలకూరి యాదయ్య,జాన్ శాస్త్రి, మాజీ కౌన్సిలర్ మారగొని గణేష్ రావుల శ్రీనివాసరెడ్డి కొండూరు సత్యనారాయణ, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి జమాల్ ఖాద్రి
నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి, వనపర్తి జ్యోతి, , కందుల లక్ష్మయ్య, తవిటి కృష్ణ బడుపుల శంకర్, వనపర్తి నాగేశ్వరరావు, పొగాకు గట్టయ్య, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి, మణిపాల్ రెడ్డి, గుండెబోయిన జంగయ్య, కోట్ల జయపాల్ రెడ్డి, జాన్ రెడ్డి, పంతంగి శ్రీనాథ్, మేక అరవింద రెడ్డి, కన్నెబోయిన నగేష్, దొడ్డి రమేష్ కంకణాల వెంకటరెడ్డి పెరికే యాదయ్య వీరమల్ల భాస్కర్.. విద్యార్థి నాయకుడు బొమ్మరబోయిన నాగార్జున, అంబటి ప్రణీత్, తగుళ్ల శ్రీను,వింజమూర్ లక్ష్మణ్, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.