నల్లగొండ పట్టణంలో వ్యక్తి దారుణ హత్య – దేవరకొండ రోడ్డుపై రక్తపు మడుగులో మృతదేహం గుర్తింపు

దేవరకొండ రోడ్‌లో రక్తపు మడుగులో మృతదేహం – కుటుంబ కలహాలేనా? లేక ఇతర కారణాలా? వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభం

నల్లగొండ పట్టణంలో వ్యక్తి దారుణ హత్య – దేవరకొండ రోడ్డుపై రక్తపు మడుగులో మృతదేహం గుర్తింపు

 

 

 

నల్లగొండ క్రైమ్  లోకల్ గైడ్: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒక వ్యక్తి దారుణ హత్య కు గురైనాడు. గురువారం ఉదయం నల్గొండ పట్టణం , దేవరకొండ రోడ్డు కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి మెమోరియల్ బాలుర జూనియర్ కళాశాల , అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని వాహనదారులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వన్ టౌన్ సిఐ ఏ మిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను సేకరించినట్టు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తులు చెవి ప్రాంతం లొ బండరాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. హత్యకు గురైన వ్యక్తి నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలం, వడ్లపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేష్ (42)గా గుర్తించారు. మృతుడు       Untitled design (1)రమేష్ నల్గొండ పట్టణంలోని బిటిఎస్ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. భార్యాభర్తల మధ్య గత మూడు మాసాలుగా అంతర్గత విభేదాలు ఉన్నట్లు సమాచారం. మూడు నెలల క్రితమే రమేష్ తో విభేదించి పుట్టింటికి భార్య వెళ్ళిపోయినట్టు సమాచారం. కుటుంబ కలహాలతోనే హత్య చేసి ఉంటారా లేక ఇంకేమైనా కారణాల అనే కోణంలో నల్లగొండ పట్టణ వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News