సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
ఏప్రిల్ 1:సిద్దిపేట జిల్లా రుద్రారాం గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా రుద్రారాం నుండి హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (JBS) వరకు నూతన బస్సు సర్వీసులు ఈరోజు ప్రారంభించబడ్డాయి.ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సహకారం అందించారు.గ్రామ సర్పంచ్ ఈదారి చంద్రకళ కనకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ BRS పార్టీ నాయకులు పడాల రాజు, అభిలాష్ రావు, పోతారం సురేష్, రాజేశ్వర్ రెడ్డి, మురళి, అంజ గౌడ్, నేరెళ్ల నవీన్, ప్రభాకర్ రావు, మండల నాగరాజు, అశోక్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, యువకులు మరియు వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై బస్సు సర్వీసుల ప్రారంభాన్ని స్వాగతించారు.