ఏప్రిల్ 5 వ తేదీన జరిగే హిందూ సమ్మేళనంను జయప్రదం చేయండి. 

ఏప్రిల్ 5 వ తేదీన జరిగే హిందూ సమ్మేళనంను జయప్రదం చేయండి. 

 

రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):

ఏప్రిల్ 5వ తేదీన జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం  చేయాలని  బుద్వేల్ రైల్వే స్టేషన్ బస్తీ హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు ఎద్దుల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం బుద్వేల్ రైల్వేస్టేషన్ బస్తీ, నేతాజీ నగర్,  శ్రీరామ్ నగర్ వెంకటేశ్వర కాలనీల ప్రజలు హిందూ సమ్మేళనం కమిటీ ఎన్నుకొన్నారు. ఈ సమ్మేళన సభను 
వెంకటేశ్వర కాలనీ బొడ్రాయి చౌరస్తాలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమ్మేళనం కార్యక్రమానికి హిందువులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మన ఐక్యతను చాటి సభను విజయవంతం చేయాలనీ కోరారు సుమారు 3 వేల మందితో సభను నిర్వహిస్తున్నట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు 
కమిటీ సభ్యులుగా సురేష్,  గణేష్, చిరంజీవి, నారాయణ మహేష్ గౌడ్,  దత్తు,  జైపాల్, బాలకృష్ణ రెడ్డి, రామారావు 
సలహాదారులుగా  సుధాకర్ గౌడ్,  మాధవ రెడ్డి,  రాజు,  జగన్,  స్వామి గౌడ్,  డాక్టర్ కృష్ణ, మురళి కృష్ణ గౌడ్,  అనంత రెడ్డి లు వ్యవహరిస్తారని కమిటీ నిర్వాకలు తెలిపారు.

Tags:

About The Author

Latest News