భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
By Ram Reddy
On
హనుమకొండ జిల్లా ప్రతినిధి ఏప్రిల్04 లోకల్ గైడ్
హనుమకొండ జిల్లాకు సంబంధించిన వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పురోగతి, భూభారతి దరఖాస్తులు, మీసేవ సర్టిఫికెట్ల జారీ, తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గౌరవెల్లి, జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతి, భూభారతి దరఖాస్తులు, సాదా బైనామా, పెండింగ్ లో ఉన్న మీసేవ సర్టిఫికెట్లు పరిష్కారానికి తీసుకోవాల్సిన సత్వర చర్యలపై కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ రవి ఆర్డీవోలు, జాతీయ రహదారుల శాఖ, ఆర్ అండ్ బి అధికారులతో పాటు తహసీల్దారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ధర్మసాగర్ వేలేరు మండలాల్లో భూ సేకరణ ప్రక్రియలో భాగంగా పెగ్ మార్కింగ్ వెంటనే మొదలు పెట్టాలని సూచించారు. అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా మార్కింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన వివిధ సర్టిఫికెట్ల జారీ లో పెండింగ్లో ఉంచవద్దని అన్నారు. అదేవిధంగా జన గణనకు సంబంధించి హౌస్ లిస్టింగ్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయడంలో సహాయ సహకారాలను అందించాలని తహసీల్దారులకు సూచించారు.ఈ సందర్భంగా హనుమకొండ పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి అధికారులు, తహసీల్దారులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
04 Apr 2026 21:39:31
వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
