విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
By Ram Reddy
On
ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్, కుర్చీలు ఉచితంగా అందించారు. విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపరచాలనే మానవతా దృక్పథంతో ఆయన ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారని, రామారావు మనసులో ఉన్న చిన్న ఆలోచనను తనతోటి వ్యక్తులకు తెలియజేయగా, వారి సహకారంతో పాఠశాల అవసరాల కోసం శనివారం టేబుల్, కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన ఎలకల వెంకటేశ్వరరావు, యాక నరసయ్య, సబ్కా షేశమ్మ, పెండపాడు కనకరాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంచి మనసుతో సహకరించిన వారందరినీ ఎంపీపీ ఎస్ యాకన్నగూడెం హెచ్ ఎం పి రాజమ్మ, ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ ఎస్ శాంతి ప్రియ, వై కవిత అభినందించారు.
Tags:
About The Author
Latest News
04 Apr 2026 21:39:31
వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
