ఉత్సాహంగా ప్రారంభమైన జర్నలిస్టుల క్రీడా పోటీలు

తొలి రోజు హోరా హోరీ గా క్రికెట్ మ్యాచ్

ఉత్సాహంగా ప్రారంభమైన జర్నలిస్టుల క్రీడా పోటీలు

క్రీడా స్ఫూర్తి చాటిన జర్నలిస్టులు

 


  నిజామాబాదు ,లోకల్ గైడ్ :
 రానున్న స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న క్రీడా పోటీ లు ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.
జర్నలిస్టుల క్రికెట్ మ్యాచ్ 
విజేతగా సాక్షి రాజు టీం, రన్నర్ గా నిలిచిన సతీష్ జట్టు .
జర్నలిస్టుల మానసిక ఉల్లాసానికి క్రీడలు  ముఖ్యమని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అంతడుపుల రామకృష్ణ, బైర శేఖర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు క్రీడల్లో భాగంగా మొదటి రోజు క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. క్రికెట్లో కట్ట సతీష్ జట్టు, సాక్షి రాజ్ కుమార్ జట్టు పోటీ పడగా టాస్ గెలిచిన కట్ట సతీష్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 12 ఓవర్లలో 89 పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సాక్షి రాజు టీం 8 ఓవర్లలో 90 పరుగుల లక్ష్యాన్ని చేదించి విజయం సాధించారు. సాక్షి రాజు జట్టు 1 వికెట్ కోల్పోగా ఓపెనర్ గా బ్యాటింగ్ చేసిన  10 టీవీ కృష్ణ 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అంతడుగపుల రామకృష్ణ, బైర శేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం( జనవరి 26), స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15), జర్నలిస్టులకు నిర్వహించే క్రీడల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా యధావిధిగా నిర్వహించామని తెలిపారు. నిర్విరామంగా ప్రతిరోజు వార్తలలో జర్నలిస్టులు నిమగ్నమై ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులకు ఈ పోటీ లు ఉపశమనం కలిగిస్తాయని అన్నారు . క్రికెట్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.      అదేవిధంగా జర్నలిస్టుల క్రీడాల కోసం పోలీసు మైదానం కేటాయించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు, ఏ ఆర్ హెడ్ క్వార్టర్ పోలీసులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. క్రీడాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే క్రికెట్ మ్యాచ్ ను ఆర్గనైజింగ్ చేసిన కట్ట సతీష్, షేక్ హైమద్లకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News