సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుదాం అధికారులతో సమీక్షలో జిల్లా ఇంచార్జి మంత్రి అనసూయ సీతక్క

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, వన మహోత్సవం, భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం

సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుదాం    అధికారులతో సమీక్షలో జిల్లా ఇంచార్జి మంత్రి అనసూయ సీతక్క

ఎరువుల కొరత తలెత్తకుండా చక్కగా వ్యవరిస్తున్నారని జిల్లా యంత్రాంగానికి ప్రశంస పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు

ప్రభుత్వ అధికారులు , ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ, సమిష్టి కృషితో నిజామాబాద్ జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుదామని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి,, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క ) పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో  ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క కీలక అంశాలపై సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, వన మహోత్సవం, భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఎరువులు, మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్ధిక పరిపుష్టికి చేపడుతున్న కార్యక్రమాలు, గృహజ్యోతి, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ పనితీరు తదితర అంశాలతో పాటు తాగునీరు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ట్రైనీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావీ, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు  సమీక్షలో పాల్గొన్నారు. 
           ఈ సందర్భంగా ఆయా అంశాల వారీగా వివరాలను కలెక్టర్ టి . వినయ్ కృష్ణారెడ్డి ఇంచార్జి మంత్రి దృష్టికి తెచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తుగానే అప్రమత్తతతో కూడిన అన్ని చర్యలు తీసుకున్నామని, కలెక్టరేట్ లో ఇతర శాఖల కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని, ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయని,  పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వ్యాధులు ప్రబలిన సందర్భాల్లో తక్షణమే స్పందించేలా రాపిడ్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలలో ప్రగతి సాధించామని, రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ సజావుగా సాగుతోందని అన్నారు. 
        ఈ సందర్భంగా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ,  వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాలో ఎరువుల కొరత తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రణాలికాబద్దంగా వ్యవహరిస్తుండడం అభినందనీయమని మంత్రి ప్రశంసించారు. వానాకాలం పంట సీజన్ ముగిసే వరకు కూడా ఇదే తరహాలో పని చేయాలని సూచించారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా సీజనల్ వ్యాధులు సోకకుండా వచ్చే రెండు నెలల పాటు ఎంతో అప్రమత్తతో వ్యవహరించాలని హితవు పలికారు. పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు గ్రామగ్రామాన శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా, పైప్ లైన్ లీకేజీలు లేకుండా అనునిత్యం పర్యవేక్షణ జరపాలని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కాటు మందు, ఇతర అన్ని రకాల ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలని, అప్పుడే వారి దృష్టికి సమస్యలు వస్తాయని, తద్వారా వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు కూరగాయల సాగు విషయంలో ప్రోత్సహించేలా ఉపాధి హామీ పథకం ద్వారా తోడ్పాటును అందించే అంశాన్ని పరిశీలిస్తామని, నిజామాబాద్ జిల్లాలో దీనిని మొదటగా ప్రయోగాత్మక పద్ధతిలో అమలు చేసిన అనంతరం రాష్ట్రం అంతటా వర్తింపజేస్తామని మంత్రి వెల్లడించారు. నీటి పారుదల, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేలా కృషి చేస్తామని, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చొరవ చూపుతామని అన్నారు.  ఉమ్మడి జిల్లాను అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించేలా అందరి సహకారంతో ముందుకు వెళ్తామని ఇంచార్జి మంత్రి స్పష్టం చేశారు. అంగన్వాడి భవనాలు, మహిళా శక్తి భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలని సూచించారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా, లోన్ బీమా తదితర ప్రయోజనాల గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ మహిళలందరూ స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేరేలా ప్రోత్సహించాలని హితవు పలికారు. కాగా, సీఎంఆర్ ధాన్యం అందించకుండా అవకతవకలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టుతో పాటు నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. డిఫాల్ట్ మిల్లులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పలు అంశాలను ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇంచార్జి మంత్రి అనసూయ సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర రైతు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
 ఇంచార్జి మంత్రికి ఘన స్వాగతం 
    మొదటగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మంగళవారం నిజామాబాద్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు ఐ.డీ.ఓ.సీకి చేరుకున్న సందర్భంగా  మంత్రికి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర జిల్లా అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. సమీక్ష అనంతరం టీఎన్జీఓ, టీజీఓ, ఇతర సంఘాల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు ఇంచార్జి మంత్రిని కలిసి వినతి పత్రాలు అందజేశారు.WhatsApp Image 2025-07-29 at 20.11.03_03654d34WhatsApp Image 2025-07-29 at 20.11.03_43f1b9ccWhatsApp Image 2025-07-29 at 20.11.02_955b76e9

Tags:

About The Author

Latest News

పద్బాంధవులుగా 108 సిబ్బంది. పద్బాంధవులుగా 108 సిబ్బంది.
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా...
రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి
భేటీ బచావో ....! భేటీ పడావో ....!!
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని  800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను  జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.
విజయవంతమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
దేశుముఖ్ లను, భూస్వాములను తర్మిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి.
అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం