విద్యార్థి ఎదుగుదలకు విద్యే అత్యంత కీలకం, ప్రభుత్వం విద్యకే అధిక ప్రాధాన్యత, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి

పీఎం శ్రీ పాఠశాల గౌరవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే – నాగర్ కర్నూల్‌ను విద్యా హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యం

విద్యార్థి ఎదుగుదలకు విద్యే అత్యంత కీలకం, ప్రభుత్వం విద్యకే అధిక ప్రాధాన్యత, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఉత్తమ పీఎం శ్రీ పాఠశాలగా ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థి ఎదుగుదల కోసం విద్య అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, జిల్లాను విద్యా హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. త్వరలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

WhatsApp Image 2025-07-29 at 20.23.03_9b8c8e67WhatsApp Image 2025-07-29 at 20.23.03_1ac5b4bb
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
విద్యార్థి ఎదుగుదలకు విద్య చాలా ముఖ్యం, విద్య అనేది కేవలం చదువుకోవడం మాత్రమే కాదు, అది వ్యక్తిగత ఎదుగుదల, నైపుణ్యాల అభివృద్ధి సమాజంలో ఒక మంచి పౌరుడిగా మారడానికి అవసరమైన జ్ఞానం మరియు అవగాహనను అందిస్తుందని నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు.
మంగళవారం నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఉత్తమ పీఎం శ్రీ పాఠశాలలగా ఎంపికైన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి హాజరయ్యారు. 
అంతకుముందు ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే పథకాన్ని ప్రారంభించి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ పీఎం శ్రీ పాఠశాలల గుర్తించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశాన్ని ఇచ్చారు.
ఈ సందర్బంగా నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.....
తెలంగాణ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, అందులో భాగంగానే నాగర్ కర్నూల్ ను విద్యా  హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు.
నాగర్ కర్నూల్ లో ఇప్పటికే మెడికల్ కళాశాల ఉందని, రానున్న రోజుల్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయించి, జిల్లా కేంద్రంలో నెలకొల్పటానికి  కృషి చేస్తున్నట్లు తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు పీఎం శ్రీ పథకం ద్వారా లబ్ధి  అయ్యేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలన్నారు. 
ఈ పాఠశాలలో చదువుకున్న పలువురు విద్యార్థులు తాను అమెరికాలో పర్యటించినప్పుడు తనకు కలిశారని ఉన్నత స్థితిలో ఉన్నారని, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా వివిధ రంగాల్లో ప్రతిభ చూపి ఉన్నత స్థితిలోకి రావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు అందుకు అనుగుణంగా వస్తువుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పనిచేస్తే, అది విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరుస్తుందని, ఆ పాఠశాలలో సానుకూల విద్యా వాతావరణాన్ని సృష్టిస్తుందని విద్యార్థులు ఉపాధ్యాయులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం ద్వారా మంచి పాఠశాలగా గుర్తింపు పొందుతుందన్నారు.
తాను పాఠశాల కూచినప్పుడు స్వాగతం పలికిన విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ నిర్వర్తించిన తీరుతనంతో ఆకట్టుకుందని తన పాఠశాల రోజులు గుర్తుకొచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా డిఇఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ.....
జిల్లాలో 27 పిఎం శ్రీ పాఠశాలలు ఉన్నాయని, మరిన్ని పాఠశాలల ఎంపికకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నతికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లత, మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

శ్రీశైల మ‌ల్ల‌న్న‌ను ద‌ర్శించుకున్న మంత్రి జూప‌ల్లి శ్రీశైల మ‌ల్ల‌న్న‌ను ద‌ర్శించుకున్న మంత్రి జూప‌ల్లి
నాగర్ కర్నూల్ జిల్లా(లోకల్ గైడ్); శ్రీశైల భ్ర‌మ‌రాంబ మ‌ల్లికార్జున స్వామివారిని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ద‌ర్శించుకున్నారు.  అర్చ‌కులు, అధికారులు ఆయ‌న‌కు ఆల‌య మర్యాదలతో...
నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని విభాగాలలో అవసరమైన వైద్య పరికరాలు  సౌకర్యాలను కల్పిస్తాం.
ప్రణాళిక బద్ధంగా ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి...
ప్రశాంత వాతావరణంలో జీవించండి: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు.
విద్యార్థుల వినతిపై తక్షణమే స్పందించిన కలెక్టర్... 
పరిగిలో రోడ్డు ప్రమాదం: ఒకరి దుర్మరణం
ప్రమాదం తప్పిన  ఆర్టీసీ బస్సు