కరెంట్ షాక్ కు గురైన బాధితుడిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు పిట్టల నాగరాజు
రూ 15000 ఆర్ధిక సహాయం అందజేత
,
మల్కాజిగిరి, లోకల్ గైడ్ : మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు విద్యుత్ ఘాతానికి గురై చికిత్స పొందుతున్న ఓ బాధితుడికి, కాంగ్రెస్ నాయకుడు పిట్టల నాగరాజు
15 వేల రూపాయలు ఆర్ధిక సాయం చేశారు. వినాయక్ నగర్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త జయంతి కుమారుడు ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కి గురై గాయల పాలైనాడు. మంగళవారం నాగరాజు , బాధితుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అతని వైద్య ఖర్చుల నిమిత్తం రూ 15,000 ఆర్ధిక సాయం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ప్రతిఒక్క కార్యకర్తకు మైనంపల్లి హన్మంతన్న ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా పోరాడే అవకాశాన్ని ప్రజలు కల్పిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. మైనంపల్లి హన్మంతన్న స్ఫూర్తితో మానవ సేవే మాధవ సేవ అంటూ నేను చేసే ప్రతి సేవ ఆ వెంకటేశ్వర స్వామే నా చేత చేయిస్తున్నాడని నమ్ముతూ ముందుకు వెళుతున్నానని నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎన్ ఆర్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
About The Author
