నల్లగొండ జిల్లా పోటో జర్నలిస్టులకు రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ అవార్డులు.

నల్లగొండ జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో  అవార్డు గ్రహీతలు ఫోటో జర్నలిస్టులకు  ఘన స న్మానం .

నల్లగొండ జిల్లా పోటో జర్నలిస్టులకు రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ అవార్డులు.

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . (లోకల్ గైడ్).
నల్లగొండ జిల్లాకు చెందిన ఫోటో జర్నలిస్టులు ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఫోటోగ్రఫీ రంగంలో రాష్ట్రస్థాయి అవార్డులు సాధించారు. 
తెలంగాణ ప్రభుత్వం చే అవార్డులు, సన్మానోత్సవాలు పొందారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేస్తున్న ఫోటో జర్నలిస్టులను నల్లగొండ ప్రెస్ క్లబ్, యూనియన్ సంయుక్తoగా ఘనంగా సన్మానించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా నుంచి ఎంపికైన ఫొటో జర్నలిస్టులు ముచ్చర్ల విజయ్, ముచ్చర్ల శ్రీనివాస్ కారింగు శ్రీనివాస్, వెంకన్న లతో పాటు కంది భజరంగ్ ప్రసాద్, చిలుముల నరేందర్ ను సైతం జర్నలి స్టులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు యూనియన్ టియుడబ్ల్యుజే 143 జిల్లా అధ్య క్షుడు గుండగోని జయశంకర్ మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినో త్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో నల్గొండ జిల్లా నుంచి నలుగురు జర్నలిస్టులు ఎంపిక కావడం అవార్డు స్వీకరించడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికైన వారు భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ అవార్డులు సాధించి నల్గొండ జిల్లాను రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష,  కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్, కోశాధికారి దండంపల్లి రవికుమార్, టియుడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి శేషరాజుపల్లి వీరస్వామి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి సల్వాది జానయ్య, ప్రచార కార్యదర్శి ఉబ్బని సైదులు, నీలకంఠం మధు, కత్తుల యశ్వంత్, కత్తుల యాదగిరి, కంది బజరంగ్ ప్రసాద్, ముచ్చర్ల విజయ్, ముచ్చర్ల శ్రీనివాస్, కారింగ్ శ్రీనివాస్, చిలుముల నరేందర్, కారింగు వెంకన్న, హరి, బోగరి రామకృష్ణ, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News

నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం
హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ క్షేత్రంలో 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవ వేడుకలు నేటితో  ప్రారంభమయ్యాయి...
మా భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపండి..!
ముగియనున్న శ్రావణమాసం బోనాలు
మహిళా శిశు వికాస కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ హితవు
ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్ల ఎత్తి నీరు విడుదల
దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధికి ఆధ్యుడు  రాజీవ్ గాంధీ
పట్టణంలో పారిశుధ్య పనులు పరిశీలించిన కలెక్టర్