గురుకుల విద్యార్థులు ఇక సురక్షితం
మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కొందుర్గు కేజీబీవీ ఉపాధ్యాయుల కృతజ్ఞతలు..
పాఠశాలలో భద్రత కోసం సీసీ కెమెరాలు అందజేసిన సయ్యద్ సాధిక్*
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
పాఠశాల విద్యార్థుల రక్షణ లక్ష్యంగా మీరు చూపిన దాతృత్వానికి వందనం.. మీ సేవకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అందిస్తున్నాం మేమందరం.. అంటూ కొందరు కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సయ్యద్ సాధిక్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన ఆయన ఈ పాఠశాలలో కూడా విద్యార్థులకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో సీసీ కెమెరాలు దగ్గరుండి ఏర్పాటు చేయించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారి షకీలా నిస్సితో సహా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సహాయం వల్ల పాఠశాలలో భద్రత మరింత బలపడిందని, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ,సిబ్బందికి సురక్షితమైన విద్య వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు. ఆయన సహకారం అమూల్యమని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు. దీనిపై సయ్యద్ సాధిక్ స్పందిస్తూ చదువుకుంటూ భవిష్యత్తు వైపు సాగే విద్యార్థులకు రక్షణ ఎంతో అవసరమని, అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని వెల్లడించారు. విద్యార్థులకు ఎంతో కొంత సహాయపడగలిగినందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
About The Author
