శ్రీ శక్తి ఆలయంలో రక్షా బంధన్-పాల్గొన్న ఎమ్మెల్యే
By Ram Reddy
On
కామారెడ్డి , లోకల్ గైడ్ :
రాఖీ పౌర్ణమి శనివారం రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ శక్తి అమ్మవారి ఆలయంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పాల్గొని , ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డిని సన్మానించారు. అనంతరం కామారెడ్డి పట్టణంలోని మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి నీ పద్మశాలి సంఘం ప్రతినిధులు సన్మానించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ ప్రతినిధులు, పద్మశాలి సంఘం ప్రతినిధులు , స్థానికులు పాల్గొన్నారు.Tags:
About The Author

Latest News
09 Aug 2025 21:38:45
ఈ నెల 15న అలాస్కాలో జరగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశాన్ని భారత విదేశాంగ శాఖ స్వాగతించింది. ఈ భేటీతో...