కొత్త రూల్ కలకలం – రిషబ్ పంత్ గాయం
తర్వాత ఐసీసీ కీలక ప్రకటన
(లోకల్ గైడ్) ;అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకొచ్చిన కొత్త సబ్‌స్టిట్యూట్ నిబంధనపై ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చ జరుగుతోంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ గాయపడిన తర్వాత, ఈ కొత్త రూల్ గురించి మరింతగా చర్చ మొదలైంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో లైక్-ఫర్-లైక్ రిప్లేస్మెంట్ అనే ఈ కొత్త నిబంధనను 2025 అక్టోబర్ నుండి అమలు చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది. దీని ప్రకారం, ఒక ఆటగాడు తీవ్రంగా గాయపడితే, అతని స్థానంలో మరొక ఆటగాడిని జట్టు తీసుకోవచ్చు. అయితే, ఇది ట్రయల్ (పరీక్షాత్మక) విధానంగా మొదలవుతుంది.ఈ రూల్ ఉద్దేశ్యం:
-
గాయాల వల్ల జట్టుకు అన్యాయం జరగకుండా చూడటం
-
మ్యాచ్లో నిష్పక్షపాతతను కొనసాగించడం
గమనిక: ఈ రూల్ కేవలం తీవ్రమైన గాయాలకే వర్తిస్తుంది. సాధారణ మసిల్లు లేదా చిన్నపాటి నొప్పులకు ఈ అవకాశం ఉండదు.
అయితే, రిప్లేస్ అయిన ఆటగాడు గాయపడిన ఆటగాడి అన్ని బాధ్యతలను తీసుకోలేడు. అంటే, అతను పూర్తిగా సబ్‌స్టిట్యూట్ కాదు, కేవలం పరిమిత విధుల్లోనే ఉంటాడు.
ప్రస్తుతం జరుగుతున్న మాంచెస్టర్ టెస్ట్‌లో పంత్ గాయం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే. గాయపడే ముందు పంత్ 37 పరుగులు చేసి, మంచి ఇన్నింగ్స్‌కి దారితీస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఆయన ఇప్పటికే 450కి పైగా పరుగులు చేశాడు. కానీ టెస్ట్ క్రికెట్లో ఈ రూల్ ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి, ఈ పరిస్థితి భారత్‌కు మంచిది కాదనే చెప్పాలి.
About The Author
