నిర్బంధంతో ఉద్యమాల్ని ఆపలేరు.
గిరిజన యువనేత ఆకాష్ నాయక్
By Ram Reddy
On
( లోకల్ గైడ్) షాద్ నగర్; రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడీ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని, వారికి మంత్రి పదవిని కల్పించాలని డిమాండ్ చేస్తూ... గిరిజన సంఘాలు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కుల గణనలో లంబాడీల జనాభా వివరాలను బహిర్గతం చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.ఈ ఉద్యమానికి ముందస్తు చర్యగా, గిరిజన యువ నేత ఆకాష్ నాయకుడిని జిల్లేడు చౌదరి గూడెం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో ఆకాష్ నాయక్ మాట్లాడుతూ...ప్రజాస్వామ్యంలో నిరసనలు, ఉద్యమాలు హక్కుగా ఉంటే... ముందస్తు అరెస్టులు ఎలా న్యాయసమ్మతమవుతాయి? ఇది ప్రజాస్వామ్యంపై నెరపుదెబ్బ. ప్రభుత్వానికి ప్రజల డిమాండ్ల పట్ల గౌరవం ఉండాలి. లంబాడీలకు రాజకీయంగా న్యాయం జరగాలి. సామాజిక న్యాయం మాటల్లో కాదు.కుర్చీల రూపంలో కనిపించాలంటూ హితవు పలికారు.అంతేకాకుండా, రాష్ట్రంలో వంచిత వర్గాలకు గళం ఇచ్చే గిరిజన ఉద్యమాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. గాంధీభవన్ ముట్టడి శాంతియుతంగా జరుగుతుందని, ప్రభుత్వ మద్దతు లేకున్నా గిరిజనుల హక్కుల సాధన కోసం ప్రజా పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
Tags:
About The Author

Latest News
01 Aug 2025 18:53:28
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా...