పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..... రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

5 కోట్ల 50 లక్షలతో నిర్మించనున్న జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..... రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం/కూసుమంచి (లోకల్ గైడ్); ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు ఉన్నా పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి గురువారం కూసుమంచిలో పర్యటించి 5 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, జిల్లా పరిషత్  హైస్కూల్ లో పి.ఎస్.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిళ్ల పంపిణీ, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కూసుమంచి మండలంలో 5 కోట్ల 50 లక్షలతో జూనియర్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాకుండా, డిసెంబర్ చివరి వరకు పనులు పూర్తి చేసి జూనియర్ కళాశాలను ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తామని అన్నారు. 

పాలేరు నియోజకవర్గంలో 8 నుంచి 10వ తరగతి చదివే ఆడ పిల్లలకు గత సంవత్సరం సైకిళ్ళను పంపిణీ చేశామని అన్నారు. ప్రస్తుతం 8వ తరగతి వచ్చిన విద్యార్దినులకు సైకిళ్ళు పంపిణీ చేస్తున్నామని అన్నారు.  ప్రతి సంవత్సరం 8 నుంచి ఇంటర్ వరకు చదివే బాలికలకు సైకిల్స్ అందిస్తానని అన్నారు. 

విద్యారంగంలో కాస్త వెనుకబడి ఉన్న పాలేరు నియోజకవర్గాన్ని విద్య పట్ల అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు.  గత 20 నెలల కాలంలో 470 కోట్ల రూపాయలను విద్యా రంగంలో పాలేరు నియోజకవర్గానికి మంజూరు చేశామని అన్నారు.  200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులం, 208 కోట్లతో జే.ఎన్.టి.యూ.  ఇంజనీరింగ్ కాలేజీ, 46 కోట్లతో ఐటిఐ కళాశాల, 5.5 కోట్ల జూనియర్ కళాశాల, తిరుమలాయపాలెం హాస్టల్ 2 కోట్ల 70 లక్షలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. 

గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని లక్ష్యంతో 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీలను పెంచామని అన్నారు. హైదరాబాద్ సమీపంలో అభివృద్ధి చేస్తున్న ఫోర్త్ సీటీ లో పిల్లలకు నైపుణ్యం నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తున్నామని అన్నారు. 

ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్న పేద పిల్లలను మణి రత్నాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. పిల్లలకు ప్రభుత్వం సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తుందని అన్నారు. పాఠశాలలో 3 కంప్యూటర్ ట్రైనింగ్ ట్యూటర్ లను నియమించేందుకు 3 లక్షల నిధులు మంత్రి మంజూరు చేశారు.  పాఠశాల కాంపౌండ్ వాల్ తో పాటు  పాఠశాలకు ఆదాయం వచ్చేలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని అన్నారు. 

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు మంజూరు చేస్తుందని, ఇందులో భాగంగా జూనియర్ కళాశాలను 5 నెలల కాలంలో పూర్తి చేయాలని మంత్రివర్యులు ఆదేశించారని, డిసెంబర్ చివరి నాటికి పాఠశాల ఎదురుగా జూనియర్ కళాశాలను సిద్దం చేస్తామని అన్నారు. 

ప్రస్తుత స్కూల్ లో 177 మంది విద్యార్థులు 10వ తరగతీ చదువుతున్నారని, ఇక్కడ జూనియర్ కళాశాల రావడం చాలా సంతోషకరమని అన్నారు.  పాఠశాలకు రెగ్యులర్ గా వచ్చేందుకు ఆడపిల్లలకు దోహదపడేలా మంత్రివర్యులు ట్రస్ట్ ద్వారా సైకిళ్ళు పంపిణీ చేస్తున్నారని అన్నారు.  

చదువు మించిన ఆస్తి మరోకటి లేదని, చదువు ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు.  పీఎం శ్రీ క్రింద ఈ పాఠశాలను ఎంపిక చేసి ల్యాబ్, ఏఐ టూల్స్ ద్వారా విద్యా బోధన వంటి అనేక సౌకర్యాలను కల్పించామని, పిల్లలు ఈ సదుపాయాలను వినియోగించుకుంటూ బాగా చదువు కోవాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం కూసుమంచి మండలానికి చెందిన 75 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలకు సైకిళ్లను అందజేసి మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ స్కూల్ ఆవరణలో సైకిల్ నడిపి పిల్లల్లో ఉత్సాహం నింపారు.  
  
ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, కూసుమంచి మండల తహసీల్దార్ రవికుమార్, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

పద్బాంధవులుగా 108 సిబ్బంది. పద్బాంధవులుగా 108 సిబ్బంది.
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా...
రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి
భేటీ బచావో ....! భేటీ పడావో ....!!
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని  800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను  జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.
విజయవంతమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
దేశుముఖ్ లను, భూస్వాములను తర్మిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి.
అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం