పెండింగ్ లో ఉన్న కార్మికుల రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి సిఐటియు ఆధ్వర్యంలో జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఉషారాణి  కి వినతిపత్రం ఇస్తున్న కార్మికులు

పెండింగ్ లో ఉన్న కార్మికుల రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి సిఐటియు ఆధ్వర్యంలో జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఉషారాణి  కి వినతిపత్రం ఇస్తున్న కార్మికులు

నాగర్ కర్నూల్ జిల్లా (లోకల్ గైడ్); నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్లో రెండు నెలల  వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో  హాస్పిటల్ కార్మికులు నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఉషారాణి  కి వినత పత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగ పొదిల రామయ్య   మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు గతంలో పనిచేసిన ఎస్ఎస్ కన్సల్టెన్సీ కింద పని చేస్తున్న కార్మికులకు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వేతనాలు చెల్లించమంటే అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు  వేతనాలు ఇవ్వకుండా  కార్మికుల పొట్ట కొడుతున్నాడని ఆయన విమర్శించారు.. అతి తక్కువ వేతనంతో కనీసం ప్రతి నెల పిఎఫ్ కట్ చేయాల్సి ఉన్న కొంతమందికి మూడు సంవత్సరాలుగా కొందరికి ఏడు సంవత్సరాల పీఎఫ్ కట్ చేయకుండా ఆ సొమ్మును దోచుకున్నాడని ఆయన అన్నారు. టెండర్ రాలేదని సాకుతో కోపంతో వేతనాలు చెల్లించకుండా అధికారులు ఎన్నిసార్లు ఫోన్లు చేసిన లిఫ్ట్ చేయడం లేదని ఈ విషయంపై జనరల్ ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ ఉషారాణి  గారిని అడిగితే మా చేతుల్లో ఏమీ లేదని చెప్పడం సరైన నిర్ణయం కాదని అగ్రిమెంటు చేసుకున్నప్పుడు డిపాజిట్ రూపంలో కొంత మొత్తాన్ని జమ చేసే కాంట్రాక్టర్ ఆ యొక్క డిపాజిట్ సొమ్మును వెంటనే కార్మికులకు ఇవ్వాలని లేదంటే నిరవధిక సమ్మెకు పూ నుకుంటామని ఆయన సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో బాలమణి రంజాన్ బి కురుమయ్య శివ   రాధ జ్యోతి బాలమణి  మీర్జా బేగం లక్ష్మమ్మ పుష్ప రేణుక మహేశ్వరి శేఖర్  తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

పద్బాంధవులుగా 108 సిబ్బంది. పద్బాంధవులుగా 108 సిబ్బంది.
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా...
రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి
భేటీ బచావో ....! భేటీ పడావో ....!!
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని  800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను  జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.
విజయవంతమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
దేశుముఖ్ లను, భూస్వాములను తర్మిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి.
అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం