రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి  

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి  

 

వికారాబాద్ (లోకల్ గైడ్): గురువారం  మినీ వీడియో కాన్ఫరెన్సు హాలు నందు హౌసింగ్ అధికారులతో  వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీ ల పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులపై సమీక్ష సమావేశం  నిర్వహించారు.. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఇందిరమ్మ ఇండ్ల కు సంబంధించిన పనులు పురోగతి లో ఉండాలని అన్నారు. అర్హుడైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు  ఇవ్వడం ప్రభుత్వ  ఉద్దేశమని , జీవితంలో సొంత ఇల్లు ఉంటె  సమాజంలో వారికీ ఒక గుర్తింపు  ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు..  జిల్లా లో ఇప్పటివరకు 11,785  మంజూరు అయ్యాయని, 5,778 గ్రౌన్దింగ్ అయ్యాయని ,882 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారని తెలిపారు.  గతం లో ఇందిరమ్మ ఇండ్ల కు సంబంధించి ఇండ్లు మంజూరు అయిన వారికీ  బిల్లు తీసుకున్న లబ్దిదారులకు రెండవ సారి అవకాశము లేదని అన్నారు.స్లాబు లేవల్ వరకు జరుగుతున్న పనులు  త్వరగా పనులు పూర్తి చేయాలి.ఇప్పటివరకు అయినంత వరకు బిల్లులు జమ అయ్యాయని వికారాబాద్  మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులలో వేగం పెంచాలని మున్సిపల్ సిబ్బంది ఆదేశించారు.  ఇందిరమ్మ నిర్మాణ పనులు త్వరగా జరిగేలా చొరవ  చూపాలని సంబంధిత అధికారులను కోరారు. 
అనంతరము పి డి హౌసింగ్ అధికారి పదవి విరమణ పొందుతున్న సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయము తో ఎన్ని సమస్యలు ఉన్న   హౌసింగ్ స్కీం ప్రోగ్రాం ను ముందుకు తీసుకు వెళ్లడం జరిగిందని,  ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే  జీవితంలో ఎంతో   సంతోషాన్ని కలిగిస్తుందని, ఉద్యోగ బాధ్యతలో భాగంగా మన సర్వీసులో నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందడం పదవీ విరమణ సమయంలో ఎంతో సంతోషాన్ని ఇ స్తుందని, పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ కలెక్టర్ ఈ సందర్బంగా వారు చేసిన సేవలను కొనియాడారు. పదవి విరమణ  అనంతరం తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని, అదేవిధంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆసక్తి ఉన్న  కార్యక్రమాలలో ముందుకు సాగాలని కలెక్టర్ కోరారు. వారికీ శాలువాలతో సన్మానం చేసి  బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి,పి డి హౌసింగ్ కృష్ణయ్య, ముక్రం బాబా, డి ఇ సయ్యద్ సాజిద్ ,తాండూర్ మున్సిపల్ కమిషనర్ విక్రమ సింహ రెడ్డి,సంబంధిత అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పద్బాంధవులుగా 108 సిబ్బంది. పద్బాంధవులుగా 108 సిబ్బంది.
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా...
రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి
భేటీ బచావో ....! భేటీ పడావో ....!!
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని  800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను  జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.
విజయవంతమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
దేశుముఖ్ లను, భూస్వాములను తర్మిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి.
అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం