వరస విజయాల ఇస్రోకు వందనం.

గాదె రుక్మారెడ్డి మెమోరియల్ హై స్కూల్ 

వరస విజయాల ఇస్రోకు వందనం.

 

మహబూబాబాద్ జిల్లా (లోకల్ గైడ్); మహబూబాబాద్ పట్టణ పరిధిలో నిన్న ఇస్రో ప్రయోగించిన రాకెట్ విజయవంతంఅయినా సందర్భంగా స్థానిక గాదెరుక్మరెడ్డిమెమోరియల్ హై లో సంబురాలు నిర్వహించారు.  ఈసందర్భంగా విద్యార్థులనుద్దేశించి పాఠశాల డైరెక్టర్స్ రీనాగోపికృష్ణ రజిత మాధవ్ మరియు కమ్మగాని కృష్ణమూర్తి ఈనాటి ఇస్రో విజయం దేశానికి గర్వకారణమన్నారు. నలభై కిలోల బరువుగల ఉపగ్రహంతో మొదలై ఈరోజు నాలుగువేల టన్నుల బరువున్న ఉపగ్రహాలను నింగిలోకి పంపే స్థాయికి చేరుకున్న  ఘనత మన  ఇస్రోదన్నారు. 1975లో ఆర్యభట్ట నుండి ఈరోజు ప్రయోగించిన  జి ఎస్ ఎల్ వి ఎఫ్ 16 రాకెట్ ప్రయోగంతో కొత్త చరిత్ర మొదలైందన్నారు. క్రయోజనిక్ ఇంజన్ల పరిజ్ఞానాన్ని ఇవ్వడానికి నిరాకరించిన అమెరికాకు దీటుగా ఇస్రో కొత్త ఆవిష్కరణలకు తెరతీసిందన్నారు. ఈరోజు శాస్త్రసాంకేతికంగా దేశం ముందుంది అంటే అదంతా ఇస్రో మేధస్సనే విషయం మరువరాదన్నారు. 2017లో పిఎసెల్వి రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను ఒకేసారి విజయవంతంగా ప్రయోగించి అమెరికా, రష్యా, చైనా దేశాలకు సవాల్ విసిరిందన్నారు.  ప్రపంచం నివ్వరపోయేలా అంగారక దక్షిణధృవంపై ఉపగ్రహాన్ని దించడమే కాకుండా రానున్న రోజుల్లో చంద్రునిపై కాలుమోపే లక్ష్యం వైపు దూసుకెళ్తున్న ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఇస్రో విజయాల స్పూర్తితో విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. . ఇంకా ఈకార్యక్రమంలో  పాఠశాల ఉపాధ్యాయులు , రఘు, హరిప్రసాద్ ఉపేందర్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పద్బాంధవులుగా 108 సిబ్బంది. పద్బాంధవులుగా 108 సిబ్బంది.
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా...
రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి
భేటీ బచావో ....! భేటీ పడావో ....!!
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని  800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను  జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.
విజయవంతమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
దేశుముఖ్ లను, భూస్వాములను తర్మిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి.
అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం