నేడు రాష్ట్రంలో కొత్త పథకం ప్రారంభం.....
By Ram Reddy
On
2.jpg)
లోకల్ గైడ్ : మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం "ఇందిరా సౌర గిరి వికాసం" అనే ప్రతిష్ఠాత్మక పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.12,600 కోట్ల వ్యయంతో ప్రకటించింది. ఇందులో భాగంగా రైతులకు సాగు అవసరాల కోసం సౌర పంప్ సెట్ ఏర్పాటుకు ఒక్కో యూనిట్‌కు రూ.6 లక్షల సంపూర్ణ సబ్సిడీగా అందించనుంది.రాష్ట్ర ఎనర్జీ మంత్రి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు, ఈ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో ఆరు లక్షల ఎకరాల భూమికి సౌర శక్తితో సాగునీరు అందించనున్నామని పేర్కొన్నారు. రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ (RoFR) – 2006 చట్టం కింద హక్కుల పత్రాలు పొందిన సుమారు 2.1 లక్షల గిరిజన రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.
Tags:
About The Author
Latest News

02 Jul 2025 20:39:22
లోకల్ గైడ్:
ఈరోజు, ఆదిత్య పార్క్ హోటల్ నందు న్యూ వేవ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఘనంగా MBBS ABROAD SEMINAR నిర్వహించండం జరిగింది.యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆసియాలో...