పోలీసు కుటుంబానికి రూ.16 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించిన జిల్లా ఎస్పీ

పోలీసు కుటుంబానికి రూ.16 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించిన జిల్లా ఎస్పీ

గద్వాల, లోకల్ గైడ్:
 కే.టి.దొడ్డి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన మహిళా కానిస్టేబుల్ సిహెచ్. శ్రావణి  2024 సెప్టెంబర్ 18న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో, శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస్ రావు  బాధిత కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా నిధుల కింద మంజూరైన రూ.16 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బాధితురాలి కుటుంబ స్థితిగతులను తెలుసుకొని మాట్లాడుతూ తమ కుటుంబానికి పోలీస్ శాఖ అన్నివేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధితురాలి తల్లి ఇందిరమ్మ, తండ్రి శ్రీ ఈశ్వరయ్య, ఎ.ఓ సతీష్, నాగమణి, విజయలక్ష్మి  పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News