*నేడు వరంగల్ ప్రెస్ క్లబ్ లో మెగా హెల్త్ క్యాంపు*

*నేడు వరంగల్ ప్రెస్ క్లబ్ లో మెగా హెల్త్ క్యాంపు*

ముందస్తు స్క్రీనింగ్ లో రక్త ప రీక్షల నిర్వహణ*

*సందర్శించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి*

_హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్):

హనుమకొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం నగర జర్నలిస్టుల కోసం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముందస్తు స్క్రీనింగ్ లో భాగంగా శనివారం నిర్వహించిన రక్త పరీక్షలకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రేపు సభ్యుల కొరకు నిర్వహించ తలపెట్టిన “మెగా హెల్త్ క్యాంప్” కోసం ముందస్తు స్క్రీనింగ్ లో భాగంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు సభ్యుల రక్త నమూనాలు సేకరించారు. ఈ పరీక్షల ఆధారంగా ఆదివారం నిపుణులైన వైద్యులు పరీక్షించి అవసరమైన వైద్యం అందించనున్నారు. ఆదివారం నిర్వహించనున్న “మెగా హెల్త్ క్యాంప్” లో భాగస్వామ్యం కావాలని ఎంఎల్ఏ రాజేందర్ రెడ్డిని కోరిన వెంటనే రక్త నమూనాల సేకరణ జరుగుతుందని తెలియజేయగా ప్రెస్ క్లబ్ కు వచ్చి జర్నలిస్టుల హెల్త్ క్యాంప్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులతో మాట్లాడుతూ జర్నలిస్టులు ఏ సమస్య ఉన్నా తనకు తెలియజేయాలని చెప్పారు.ఎల్లప్పుడూ జర్నలిస్టులకు అండగా నిలుస్తానని అన్నారు. కాగా ఆదివారం హెల్త్ క్యాంపు లో ప్రముఖ కార్డియాలజిస్టులు డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ వివేక్, డాక్టర్ కూరపాటి మధు, డాక్టర్ అనిల్ రెడ్డి, న్యూరో ఫిజీషియన్లు డాక్టర్ వినయ్ కుమార్ గౌడ్, డాక్టర్ శ్రీచరణ్, డాక్టర్ నర్సింగరావు, గ్యాస్ట్రో, ఫిజీషియన్ లు డాక్టర్ సుమన్, డాక్టర్ సుమన్, డాక్టర్ వైద్యం గౌతమ్ తదితరులు సేవలు అందించనున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు తెలిపారు. కార్డియాక్ డాక్టర్లతో పాటు ఈసీజీ మెషిన్లు, టూడీ ఈకో మెషిన్ సైతం క్లబ్ లో అందుబాటులో ఉంటాయని, సభ్యులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా మొదటి రోజు 124 మంది సభ్యులు రక్త పరీక్షలకు హజరయ్యారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, ఉపాధ్యక్షులు గోకారపు శ్యాం,బొడిగె శ్రీను, కొడిపెల్లి దుర్గాప్రసాద్ రావు, యంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీలు సంపెట సుధాకర్, పెద్దపెల్లి వరప్రసాద్, పొడిచెట్టి విష్ణువర్ధన్, వివిధ సంఘాల నేతలు గాడిపెల్లి మధు, కంకణాల సంతోష్, వల్లాల వెంకటరమణ, తోట సుధాకర్, వర్థెల్లి లింగయ్య, గడ్డం కేశవమూర్తి, దుంపల పవన్, అచ్యుత రఘునాధ్, మైదం సుధాకర్, కట్ట రాజు, రామకృష్ణాచారి, ప్రభాకర్, రామాచారి, సాజీద్, టీవీ రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News