నేత్రదానం పై అవగాహన పెంచుకోవాలి.

నేత్రదానం పై అవగాహన పెంచుకోవాలి.

నేత్రదాన అవగాహన కెనోపిని ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు గుంటకండ్ల దామోదర్ రెడ్డి .


నల్లగొండ జిల్లా ప్రతినిధి .లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో  శనివారం బోయవాడ లోని పెన్షనర్స్ సామాజిక సేవ సదన్ నందు వీరి రాష్ట్ర అధ్యక్షులు గుంటకండ్ల దామోదర్ రెడ్డి  నేత్రదాన అవగాహన కెనోపిని ఆవిష్కరించారు.

జిల్లా అధ్యక్షులు జి వెంకట్ రెడ్డి, కార్యదర్శి శ్రీశైలం, భవన కమిటీ అధ్యక్షులు గాయం నారాయణరెడ్డి, మండల అధ్యక్ష కార్యదర్శులు సత్యం, వాసుదేవ్, జిల్లా ప్రచార కార్యదర్శి మందడి శంకర్ రెడ్డి  పాల్గొన్నారు. 

ఈ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గుంటకండ్ల దామోదర్ రెడ్డి  మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో కార్నియా అంధత్వం తో బాధపడుతున్న వారు 13 లక్షల మంది ఉన్నారని వీరందరికీ కంటి చూపు రావాలంటే మరణానంతర నేత్రదానం ఒక్కటే పరిష్కారమని, నేత్రదానానికి దాత యొక్క వయస్సు, కంటి ఆపరేషన్లు, కంటిచూపుతో సంబంధం లేదని, అందుకే మన చుట్టుపక్కల ఎవరైనా స్వర్గస్తులయితే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించవలెనని, ఒకవేళ పార్థివదేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచినట్లయితే 12 నుంచి 15 గంటలలోగా నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు నుండి నలుగురు కార్నియల్ అంధులకు కంటిచూపును ప్రసాదించవచ్చని అందుకు వారి కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల ను 9948143299 ఫోన్ నెంబర్ నందు సంప్రదించాలని తెలిపారు. 

కెనోపి ప్రదర్శన ద్వారా మరియు తెలుగు పాంప్లెట్ అందించుట ద్వారా నేత్రదానం గూర్చి వేలాది మందికి అవగాహన కల్పిస్తూ 144 మంది స్వర్గస్తులైన వారి నుండి 288 కార్నియా అను కంటిపొర లను సేకరించి 300 కి పైగా కార్నియల్ అంధులకు కంటిచూపును అందించిన లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ, ఐ డొనేషన్ సెంటర్ సిబ్బందిని అభినందించారు. 

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కె.వి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కడిమి, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ నితీష, కోట సరిత, చంద్రశేఖర్ చిరునోముల, బచ్చల కూర జానీ, వేముల సాయికుమార్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ దామర యాదయ్య, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ కొనకంచి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News