అంతర్జాతీయ క్రికెట్‌కు మరో స్టార్ ప్లేయర్ గుడ్‌బై

 అంతర్జాతీయ క్రికెట్‌కు మరో స్టార్ ప్లేయర్ గుడ్‌బై

లోక‌ల్ గైడ్ : 
అంతర్జాతీయ క్రికెట్‌కు మరో స్టార్ ప్లేయర్ గుడ్‌బై చెప్పాడు. వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్, వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌ (Nicholas Pooran) మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అతడు కేవలం 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం విశేషం. అయితే పూరన్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు.ఇటీవల దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్ ప్రకటించిన తక్కువ వ్యవధిలోనే పూరన్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌ను వదిలేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించిన పూరన్ – ‘‘చాలా ఆలోచించి ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నా. వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు గౌరవంగా, గుర్తుండిపోయే అనుభవంగా మిగిలింది. ఆ మెరూన్ జెర్సీ ధరించడం, జాతీయ గీతం కోసం నిలబడటం, ప్రతి మ్యాచ్‌లో నా శ్రద్ధ అంతా పెట్టడం నా జీవితంలో అమూల్యమైన భాగం’’ అని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు.‘‘నా కెప్టెన్సీ కాలం, నా ఆట ప్రయాణం, అభిమానుల ప్రేమ, కుటుంబం మద్దతు – ఇవన్నీ నాకు శక్తినిచ్చాయి. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని పూరన్ పేర్కొన్నాడు.
పూరన్ 61 వన్డేల్లో 1983 పరుగులు చేశాడు, ఇందులో 3 శతకాలు ఉన్నాయి. 106 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 2275 పరుగులు సాధించాడు. ఇటీవల జరిగిన IPL 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 14 మ్యాచ్‌ల్లో దాదాపు 200 స్ట్రైక్‌రేట్‌తో 524 పరుగులు చేసి సిక్సర్లతో కనువిందు చేశాడు.విండీస్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించిన పూరన్... మరో 8 నెలల్లో జరిగే T20 వరల్డ్‌కప్‌ను ముందుగా వదిలేయడం జట్టుకు గట్టి నష్టం అనే చెప్పాలి.

Tags:

About The Author

Latest News

పద్బాంధవులుగా 108 సిబ్బంది. పద్బాంధవులుగా 108 సిబ్బంది.
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా...
రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి
భేటీ బచావో ....! భేటీ పడావో ....!!
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని  800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను  జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.
విజయవంతమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
దేశుముఖ్ లను, భూస్వాములను తర్మిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి.
అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం