ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల: ఫస్టియర్‌లో 67%, సెకండియర్‌లో 50% ఉత్తీర్ణత

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల: ఫస్టియర్‌లో 67%, సెకండియర్‌లో 50% ఉత్తీర్ణత

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారులు సోమవారం ప్రకటించారు. ఈసారి ఫస్టియర్‌లో 67.4 శాతం, సెకండియర్‌లో 50.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో బాలికల ఉత్తీర్ణత శాతం 73.88 కాగా, బాలురది 61.75 శాతం. గతంతో పోలిస్తే రెండు ఇయర్‌లలోనూ ఉత్తీర్ణత శాతం పెరగడం విశేషం.2024లో ఫస్టియర్‌లో 63.86 శాతం, 2023లో 62.58 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసారి అది 67.4 శాతం కి చేరింది. సెకండియర్‌లో ఈసారి 50.82 శాతం పాసైతే, గతేడాది 43.77 శాతం, 2023లో 46.06 శాతం మాత్రమే పాసయ్యారు.

కోర్సుల వారీగా:
ఎంపీసీ కోర్సులో అత్యధిక ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్‌లో 78.26 శాతం, సెకండియర్‌లో 59.06 శాతం మంది పాసయ్యారు. బైపీసీ కోర్సులో ఫస్టియర్‌లో 71.2 శాతం, సెకండియర్‌లో 54.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. సీఈసీ కోర్సులో ఫస్టియర్‌లో 37.72 శాతం, సెకండియర్‌లో 38.02 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Tags:

About The Author

Latest News

ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు
-బల్లలు, ఆఫీసు టేబుల్ అందజేసిన..కోమరగౌని వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్ ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేస్తాం..కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని...
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వైయస్సార్ సేవలు మరువలేనివి.
కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాం -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి