ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి

ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి

నిజామాబాదు ,లోకల్ గైడ్ : 
         రాష్ట్రంలో విద్యార్థుల స్కాలర్ షిప్లు , ఫీజ్ రీఎంబర్శ్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని నిజామాబాదు కేర్ డిగ్రీ కళాశాల అధినేత , జాగృతి నాయకుడు నరాల సుధాకర్ డిమాండ్ చేశారు . భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి అధ్యక్షతన యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మొదటి మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం మంగళవారం జిల్లా కేంద్రంలో గల ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు . ఈ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చెయ్యకపోవడం వలన విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .అనేక సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన కనీస స్పందన లేదని అన్నారు. అలాగే నేటి విద్యార్థులంతా ఆన్లైన్ గేమ్ లకు సోషల్ మీడియాకు బానిసరి కావద్దని భారతదేశం గర్వించదగా పౌరులుగా ఎదగాలని సూచించారు.  యుఎస్ఎఫ్ ఐ విద్యార్థి సంఘం విద్యార్థుల పక్షాన అలుపెరుగని పోరాటాలు చేస్తూ , అనేక సమస్యల్ని పరిష్కరించే రకంగా కృషి చేస్తుందని అన్నారు . ఇలాంటి విద్యార్థి సంఘాలకు అండగా విద్యార్థులు చేరి సమాజాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. 
           అలాగే ఈ సమావేశానికి అతిథులుగా హాజరైన జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కోయడ నరసయ్య మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా ఒక సావిత్రిబాయి పూలె , భగత్ సింగ్ లాంటి త్యాగమూర్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలని తెలియజేశారు. రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, ఏఐకేఎస్ జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్ రావు  మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రైవేటు కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నాయని అన్నారు .  పోరాటంతోటే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు , ప్రజలు , రైతులు , కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు . ఈ సమస్యల పరిష్కారానికి పోరాటం ఒక్కటే మార్గమని , నమ్మి అనేక త్యాగాలు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటూ విద్యార్థుల పక్షాన నిలబడి కొట్లాడుతున్న యుఎస్ఎఫ్ ఐ విద్యార్థి సంఘ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి  పెద్ది సూరి మాట్లాడుతూ ప్రభుత్వ విద్య రంగ బలోపేతానికి, ప్రభుత్వ రంగ సమస్యలను పరిష్కారానికి మరియు ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థల దోపిడి అరికట్టడానికి సెప్టెంబర్ నెలలో వైఎస్ఎఫ్ఐ తెలంగాణ మొదటి రాష్ట్ర మహాసభల వేదికపై ఉద్యమ కార్యచరణ రూపొందించుకొని మహనీయులు కోరుకున్న సమసమాజ స్థాపన దిశకై పోరాటాలని కొనసాగిస్తామని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బాదం తిరుపతి , జిల్లా అధ్యక్షులు సిద్ధల నాగరాజు , యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు వెంకటేష్, రాజేష్, మధు,నాగేష్, తిరుపతి, గణేష్ , నిజాంబాద్ జిల్లా నాయకులు మహేష్ , వేణు , గణేష్ బాబురావు ,శివ, జవహార్,ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు
-బల్లలు, ఆఫీసు టేబుల్ అందజేసిన..కోమరగౌని వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్ ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేస్తాం..కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని...
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వైయస్సార్ సేవలు మరువలేనివి.
కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాం -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి