శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి 

శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి 

- జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు.

గద్వాల, లోకల్ గైడ్ :
పంచాయతీ కార్యదర్శులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామస్థాయిలో పూర్తిగా అమలు చేసి,ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు భారత ప్రభుత్వం పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, సిబ్బంది, పెన్షన్ల మంత్రిత్వశాఖ సహకారంతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ,పంచాయతీరాజ్ గ్రామీణాభి వృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం, గ్రామసభలపై ప్రతీ మండల నుంచి ఇద్దరు చొప్పున పంచాతీయ కార్యదర్శులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అత్యంత ముఖ్యమైందని తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలంటే, కార్యదర్శి ప్రజలతో బలమైన అనుబంధాన్ని నెలకొల్పి,వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుంటూ నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామస్థాయిలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం, ప్రజలకు అందాల్సిన సేవలు, అభివృద్ధి పనులు గ్రామసభల ద్వారానే చర్చించబడాలని, అవి పారదర్శకంగా జరగాలని సూచించారు.ప్రభుత్వ పథకాలను అర్హుల వరకు చేరేలా చూడాలని సూచించారు.సమాచార హక్కు చట్టం ప్రతి పౌరుడికి ముఖ్యమైన సాధనం అని పేర్కొన్నారు. ప్రజలెవరికైనా ప్రభుత్వ పనులు, పథకాల వివరాలు తెలుసుకునే హక్కు ఉందని, అందువల్ల పంచాయతీ కార్యదర్శులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళా సంఘాలు, యువజన సంఘాలు, గ్రామ స్థాయిలోని ఇతర సంఘాలతో కలిసి పని చేస్తే అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని తెలిపారు. గ్రామాల్లో అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ, జిల్లాలో ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కార్యదర్శులకు సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీవో నాగేంద్రం, మాస్టర్ ట్రైనర్ రిటైర్డ్ డీపీవో కృష్ణ, శిక్షణ రీజినల్ మేనేజర్ డా.హన్మంతు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు
-బల్లలు, ఆఫీసు టేబుల్ అందజేసిన..కోమరగౌని వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్ ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేస్తాం..కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని...
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వైయస్సార్ సేవలు మరువలేనివి.
కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాం -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి