కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాం -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాం -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

లోకల్ గైడ్  / పరిగి : 

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక లేఖ రాస్తే, అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచడానికి సిద్ధంగా ఉన్నామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.రాజకీయ ఉనికి కోసమే బీఆర్ఎస్ పార్టీ హడావుడి చేస్తుందని రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం కింద తొమ్మిది రోజుల్లోనే రూ.9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల మద్దతు కోల్పోయిన బీఆర్ఎస్, ఇప్పుడు బంధువుల పార్టీగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేఖ రాసిన పక్షంలో, బీఆర్ఎస్ లేవనెత్తిన ఏ అంశంపైనైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రామ్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Tags:

About The Author

Latest News

ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు
-బల్లలు, ఆఫీసు టేబుల్ అందజేసిన..కోమరగౌని వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్ ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేస్తాం..కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని...
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వైయస్సార్ సేవలు మరువలేనివి.
కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాం -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి