వైయస్సార్ సేవలు మరువలేనివి.
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్.
లోకల్ గైడ్/ తాండూర్:
దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి..డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ పెద్దేముల్ మండల అధ్యక్షుడు గోపాల్ పేర్కొన్నారు.మంగళవారం,తట్టేపల్లి గ్రామ కమిటి అధ్యక్షుడు కల్కోడ.నర్సింలు ఆధ్వర్యంలో, ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ క్రమంలో వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి,పలువురు నివాళ్ళు అర్పించారు.ఈ సందర్భంగా టిపిసిసి మైనారిటీ డిపార్ట్మెంట్ రాష్ట కన్వీనర్ యండి.రియాజ్ మాట్లాడుతు.... వైఎస్ఆర్ సేవలు మరువలేనివి, నిత్యం ఆయన పేద ప్రజల కోసం, రైతుల కోసం పరితపించే రైతు పక్షపాతి అని కీర్తించారు.వైఎస్ఆర్ వారసునిగా... మన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూర్ అభివృది పథంలో దూసుకుపోతుందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోని అనేక సంక్షేమ కార్యక్రమాలు... పేదలకు ఇందిరమ్మ ఇళ్ల,రేషన్ కార్డులు,రైతు భరోసా, రైతు ఋణ మాఫీ, ఉచిత విద్యుత్,మహిలలకు ఉచిత బస్సుతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జగన్, హన్మంతు,విద్యాకర్,బాబా, హుసేన్,హాజి పటేల్,పండరి, ఫరూఖ్, నాజర్ పటేల్,రంజీ నాయక్,జహీర్, ఎర్రవల్లి బిచప్ప,రాములు, తతితరులు పాల్గొన్నరు.