ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు
-బల్లలు, ఆఫీసు టేబుల్ అందజేసిన..కోమరగౌని వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఖజాగుడా గ్రామానికి చెందిన కోమరగౌని శంకర్ గౌడ్ జ్ఞాపకార్ధం వారి కుమారుడు వెంకటేష్ గౌడ్, మనవడు అఖిల్ గౌడ్ పాఠశాలకు బల్లలు, ఆఫీస్ టేబుల్ అందజేసారు. కీర్తిశేషులు శంకర్ గౌడ్ జ్ఞాపకార్థం పాఠశాల ఆవరణలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్ అఖిల్ గౌడ్, స్థానిక నేతలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాలకు బల్లలు, టేబుల్ అందజేసిన అఖిల్ గౌడ్ తన దాతృత్వాన్ని చాటుకన్నారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ మాట్లాడుతూ..పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలన్న ఆలోచన నిజంగా ప్రశంసనీయమైనది అన్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుచుకుంటూ సమాజ సేవలో ముందుంటున్న వెంకటేష్ గౌడ్, తండ్రికి తగిన తనయుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారని కొనియాడారు. ఆనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ.. కష్టపడి చదివితే రానున్న జీవితంలో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకొని చదువుల్లో రాణించి గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బాగా చదివి తల్లిదండ్రుల, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు డొనేట్ చేయడానికి దాతలు ముందుకు వస్తే, తాను సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయి బాబా, జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి, శ్యామలా, ఉపాధ్యాయులు నరహరి, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఈశ్వరయ్య, సుధాకర్, అరుణ్, కిషోర్, నవీన్, ప్రభాకర్, సత్తయ్య, పవిత్రమ్మ, నిర్మలమ్మ, యాదయ్య, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.