భద్రకాళి దేవస్థానంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
హనుమకొండ జిల్లా లోకల్ గైడ్ :
వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జెండావందన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 8-00లకు దేవాలయ చైర్మన్ డా. బి. శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, బింగి సతీష్, గాండ్ల స్రవంతి, మోతుకూరి మయూరి, జారతి వెంకటేశ్వర్లు, పాలడుగుల అంజనేయులు, అనంతుల శ్రీనివాస్, శ్రీ పార్నంది నర్సింహమూర్తి, ఈ.ఓ రామల సునీత, శ్రీ భద్రకాళి శేషు దేవాలయ అర్చకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనముకు భక్తులు దేవాలయమునకు పోటెత్తారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఓడిబియ్యం పోసి అమ్మవారికి చీరలు సమర్పించారు. శుక్రవారం రోజు ఉదయం దేవాలయమును నగర మేయర్ గుండు సుధారాణి, అమ్మవారికి ఓడిబియ్యం పోసి చీర సమర్పించారు. అనంతరం మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించారు.
అనంతరం న్యూ ఢిల్లి నుండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ శ్రీ జితేంద్ర గుప్తా, సి.పి.ఎం.జి తెలంగాణా పి.వి.ఎస్ రెడ్డిలు ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. ఆలయానికి విచ్చేసిన ప్రముఖులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. పూజానంతరం ఆలయ మహామండపంలో శ్రీ భద్రకాళి శేషు ఆధ్వర్యవమున అర్చకులు, వేదవిద్యార్థులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు, చిత్రపటమును బహూకరించి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎస్.పి. రవికుమార్, హనుమకొండ ఎస్.పి హనుమంతు, సీతారాం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.రామల సునీత
కార్యనిర్వహణాధికారి/సహాయ కమీషనర్, శ్రీ భద్రకాళీ దేవస్థానం, వరంగల్
About The Author
