రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో

ఘనంగా 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ముఖ్య అతిథితులుగా పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో

గ్రంథాలయ కమిటీ చైర్మన్ కొప్పుల మదన్ మోహన్ రెడ్డి,వైస్ చైర్మన్ నక్క బాల్ రాజ్ యాదవ్, సి.వీరేష్ , అటెండర్ శంకర్ కు సైకిల్ బహుకరణ 

IMG-20250815-WA0540లోకల్ గైడ్ షాద్ నగర్ : 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గ్రేట్ వన్ శాఖ గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు కొప్పుల మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో,ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ఉత్సాహంగా నిర్వహించారు.ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు నేలకొరిగి,  తమ ప్రాణాలను తృచ్చ ప్రాయంగా వదిలిపెట్టి, మనందరికీ స్వేచ్ఛ వాయువులు ప్రసాదించిన ఈ శుభదినమే మన స్వాతంత్ర దినోత్సవం. దేశమంతటా ఘనంగా జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభ తరుణంలో షాద్ నగర్ గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయ కార్యాలయంలో జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి, స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు.79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు, మూడు రంగుల జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ టెంకాయ కొట్టి, గ్రంధాలయ చైర్మన్ కొప్పుల మదన్ మోహన్ రెడ్డి ని జెండా ఎగరేయమని ఆదేశించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి తో పాటు పట్టణ పుర ప్రముకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ కొప్పుల మదన్మోహన్ రెడ్డి , వైస్ చైర్మన్ నక్క బాల్ రాజ్ యాదవ్,వీరేశం, ప్రధాన కార్యదర్శి క్యూసెట్ శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ జూపల్లి చంద్రశేఖర్ ఆర్గనైజర్ అల్వాల దర్శన్ గౌడ్ జెయింట్ ట్రెజరర్ కత్తి చంద్రశేఖరప్ప డైరెక్టర్స్  శ్రీకాంత్, అక్రమ్, ఫయాజ్ రాజేష్ తూం కృష్ణారెడ్డి చీపిరి శివరాములు యాదవ్, ఆలోనపల్లి రాజు గౌడ్, జట్టు అనిల్ కుమార్, నాయకులు పాల్గొన్నారు. అనంతరం గ్రంథాలయం లో అటెండర్ గా పనిచేస్తున్న శంకరకు సైకిల్ ను కమిటీ సభ్యులు బహుకరించారు.

Tags:

About The Author

Latest News